ఆ రెండూ కలిపి...

ABN , First Publish Date - 2021-06-22T16:08:18+05:30 IST

అధిక బరువు తగ్గడం కోసం కీటో డైట్‌, ఇంటర్‌మిటెంట్‌ ఫాస్టింగ్‌లను అనుసరిస్తూ ఉంటాం. అయితే ఈ రెండింటినీ కలిపి అనుసరిస్తే, మరింత వేగంగా బరువు తగ్గే వీలుంది అంటున్నారు నిపుణులు. అదెలాగంటే...

ఆ రెండూ కలిపి...

ఆంధ్రజ్యోతి(22-06-2021)

అధిక బరువు తగ్గడం కోసం కీటో డైట్‌, ఇంటర్‌మిటెంట్‌ ఫాస్టింగ్‌లను అనుసరిస్తూ ఉంటాం. అయితే ఈ రెండింటినీ కలిపి అనుసరిస్తే, మరింత వేగంగా బరువు తగ్గే వీలుంది అంటున్నారు నిపుణులు. అదెలాగంటే...


కీటోలో తక్కువ పిండిపదార్థాలు, ఎక్కువ కొవ్వులు ఉంటాయి. ఒక సమయ పరిధికి కట్టుబడి పరిమితంగా ఆహారం తీసుకోవడం, కనీసం 16 గంటల పాటు ఆహారం తీసుకోకుండా ఉండడం ఇంటర్‌మిటెంట్‌ ఫాస్టింగ్‌ నియమం. ఈ రెండు డైటింగ్‌ పద్ధతులనూ కలిపి పాటించడం అంటే ఇంటర్‌మిటెంట్‌ ఫాస్టింగ్‌లో తీసుకునే పిండిపదార్థాలను తగ్గించడం. ఇలా అతి తక్కువ పిండిపదార్థాలతో ఎక్కువ సమయాల పాటు ఉపవాసం ఉండడం వల్ల శరీరంలో కిటోసిస్‌ వేగవంతమై అదనపు కొవ్వు కరుగుతుంది. అలాగే మెటబాలిజం పెరిగి హార్మోన్‌ వ్యవస్థ పనితీరు మెరుగవుతుంది. ఫలితంగా వేగంగా బరువు తగ్గుతాం. అధిక బరువు కలిగి ఉండి, టైప్‌2 మధుమేహం కోవకు చెందిన వారు ఇలా కీటో, ఐఎఫ్‌ డైట్‌ను కలిపి అనుసరించడం వల్ల త్వరగా బరువు తగ్గే వీలుంటుందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి.


అయితే ఈ రెండు డైట్స్‌కూ వేటికవి వేర్వేరు దుష్ప్రభావాలు కలిగి ఉంటాయి. కాబట్టి రెండింటినీ కలిపి అనుసరిస్తున్నప్పుడు రెండింతల సైడ్‌ ఎఫెక్ట్స్‌ను ఎదుర్కోవడానికి సిద్ధపడాలి. షుగర్‌ లెవల్స్‌ తగ్గడం, తలతిరగడం, బడలిక, భావోద్వేగాల్లో మార్పులు, మలబద్ధకం లాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ తప్పవు. అలాగే ఈ రెండు రకాల డైట్స్‌ను కలిపి అనుసరించడానికి ఎంతో ఓర్పు, నిబద్ధత, పట్టుదల అవసరం. ఆరోగ్య సమస్యలు కలిగినవారు ఈ సరికొత్త డైట్‌ ట్రెండ్‌ను అనుసరించే ముందు తప్పనిసరిగా వైద్యుల సలహా తీసుకోవాలి.


Updated Date - 2021-06-22T16:08:18+05:30 IST