రాఖీ.. డోపీ లిఫ్టర్‌పై సస్పెన్షన్‌ వేటు

ABN , First Publish Date - 2021-04-10T09:03:31+05:30 IST

కామన్వెల్త్‌ చాంపియన్‌షి్‌ప స్వర్ణ పతక విజేత, వెయిట్‌లిఫ్టర్‌ రాఖీ హల్దార్‌ డోపింగ్‌లో దొరికిపోయింది.

రాఖీ.. డోపీ లిఫ్టర్‌పై సస్పెన్షన్‌ వేటు

న్యూఢిల్లీ: కామన్వెల్త్‌ చాంపియన్‌షి్‌ప స్వర్ణ పతక విజేత,  వెయిట్‌లిఫ్టర్‌ రాఖీ హల్దార్‌ డోపింగ్‌లో దొరికిపోయింది. 2019 చాంపియన్‌షి్‌పలో మహిళల 64 కిలోల విభాగంలో టైటిల్‌ సాధించిన రాఖీ.. నిరుడు నవంబరులో నిర్వహించిన డోపింగ్‌ పరీక్షలో విఫలమైంది. దాంతో ఆమెపై సస్పెన్షన్‌ వేటు వేసినట్టు జాతీయ కోచ్‌ ఒకరు శుక్రవారం వెల్లడించారు. ఫలితంగా వచ్చేవారం జరిగే ఒలింపిక్‌ అర్హత టోర్నీ ఆసియా వెయిట్‌లిఫ్టింగ్‌ చాంపియన్‌షి్‌పలో పాల్గొనే భారత జట్టు నుంచి రాఖీని తప్పించారు.  

Updated Date - 2021-04-10T09:03:31+05:30 IST