Advertisement
Advertisement
Abn logo
Advertisement

మహాపాదయాత్రకు స్వాగత సన్నాహాలు

ఒంగోలు: అమరావతి రైతులు చేపట్టిన మహాపాదయాత్రకు ప్రకాశం జిల్లాలో ఘనస్వాగతం పలికేందుకు టీడీపీ నేతలు సిద్ధమవుతున్నారు. అమరావతి రాజధాని పరిరక్షణ కోసం న్యాయస్థానం టూ దేవస్థానం పేరుతో ఆప్రాంత రైతులు, మహిళలు మహాపాదయాత్రను చేపట్టిన విషయం విదితమే. ఈనెల 1న తుళ్లూరు నుంచి ప్రారంభమైన పాదయాత్ర ప్రస్తుతం గుంటూరు జిల్లాలో కొనసాగుతోంది. ఈనెల 6న ప్రకాశం జిల్లాలో ప్రవేశించి 19వతేదీ వరకూ 14రోజులపాటు కొనసాగనుంది. ఐదు నియోజకవర్గాల గుండా ఈ యాత్ర సాగనుండగా అన్నిచోట్లా పాదయాత్ర బృందానికి సహకారం అందించడంతోపాటు పెద్దఎత్తున మద్దతు తెలిపేందుకు వివిధ వర్గాలు ముందుకు వస్తున్నాయి. అధికార వైసీపీ మినహా ఇతర పార్టీలన్నీ సంఘీభావం ప్రకటించాయి. ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ జిల్లాలో పాదయాత్ర విజయ వంతంపై ఎక్కువ దృష్టిపెట్టింది.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement