ఎమ్మెల్సీ రమేష్‌కు ఘనస్వాగతం

ABN , First Publish Date - 2021-06-23T05:28:21+05:30 IST

ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం మంగళవారం తొలిసారిగా ఎమ్మెల్సీ ఆర్‌వీ రమేష్‌ ప్రొద్దుటూరు వచ్చిన సందర్భంగా వైసీపీ శ్రేణులు భారీగా ర్యాలీతో ఘన స్వాగతం పలికారు.

ఎమ్మెల్సీ రమేష్‌కు ఘనస్వాగతం
ఊరేగింపుగా వస్తున్న ఎమ్మెల్సీ రమేష్‌

ప్రొద్దుటూరు, జూన్‌ 22 :ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం మంగళవారం తొలిసారిగా ఎమ్మెల్సీ ఆర్‌వీ రమేష్‌ ప్రొద్దుటూరు వచ్చిన సందర్భంగా వైసీపీ శ్రేణులు భారీగా ర్యాలీతో ఘన స్వాగతం పలికారు. ముందుగా  మైదుకూరురోడ్డులోని వైఎస్‌ విగ్రహానికి పూలమాలవేసి విలేఖరుల సమావేశంలో రమేష్‌ మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి బడుగు బలహీన వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చారని అందులో భాగంగానే ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన తనకు ఎమ్మెల్సీ అవకాశాన్ని కల్పించారన్నారు. ముఖ్యమంత్రి సొంతజిల్లా నుంచి యాదవ కులానికి చెందిన తాను చట్టసభలకు వెళ్లడం సువర్ణాక్షరాలతో లిఖించుకోవాలన్నారు. తనకు ఎమ్మెల్సీ పదవిని ఇచ్చిన సీఎంతోపాటు ఎంపీ అవినాష్‌రెడ్డికి, ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటానన్నారు.  వైసీపీ నాయకులు, కార్యకర్తలకు  కృతజ్ఞతలు తెలిపారు. 

 ర్యాలీకి నో పర్మిషన్‌: ఎమ్మెల్సీ రమేష్‌ ప్రొద్దుటూరుకు వస్తుండగా, యాదవ సామానిక వర్గం, వైసీపీ నాయకులు  ర్యాలీ ఏర్పాట్లు చేశారు. అయితే స్థానిక రూరల్‌ ఎస్‌ఐ రవికుమార్‌ అక్కడికి చేరుకుని నిబంధనల మేరకు ర్యాలీకి అనుమతి లేదని హెచ్చరిక చేశారు.  వైసీపీ శ్రేణులు కలుగజేసుకోవడంతో ర్యాలీ ముందుకు సాగింది. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు మురళీధర్‌రెడ్డి, ఇర్ఫాన్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-23T05:28:21+05:30 IST