బడిపిల్లల కథలకు ఆహ్వానం

ABN , First Publish Date - 2020-03-06T06:06:30+05:30 IST

కొత్తనీరు ప్రవాహాన్ని పరివ్యాప్తం చేయడమేకాక జవసత్వాలను ఇస్తుందన్నది నిజం. అది ఇవ్వాళ్ళ మన పిల్లలు చదువుకునే సాహిత్యంలో స్పష్టంగా కనిపిస్తోంది. మన బడి పిల్లలు రాసిన రచనలతో రెండు తెలుగు

బడిపిల్లల కథలకు ఆహ్వానం

కొత్తనీరు ప్రవాహాన్ని పరివ్యాప్తం చేయడమేకాక జవసత్వాలను ఇస్తుందన్నది నిజం. అది ఇవ్వాళ్ళ మన పిల్లలు చదువుకునే సాహిత్యంలో స్పష్టంగా కనిపిస్తోంది. మన బడి పిల్లలు రాసిన రచనలతో రెండు తెలుగు రాష్ట్రాల నుండి ఈ మధ్య కాలంలో 250కి పైగా పుస్తకాలు రావడం అందుకు నిదర్శనం. ఇక ‘బాల చెలిమి’ విషయానికి వస్తే తెలుగు బాల సాహిత్య చరిత్రలోనే తొలిసారిగా ‘తెలంగాణ బడి పిల్లల కథలు’ పేర తెలంగాణలోని పాత పది జిల్లాల వారీగా బడి పిల్లలు రాసిన కథలను ప్రచురించి పది పుస్తకాలను ఒకే వేదికపైన ఆవిష్కరించి కొత్త చరిత్రను సృష్టించింది.  ఇవేకాక బాల సాహిత్య లోకంలో మరికొన్ని మేలిమి రచనలు, అనువాదాలు, తెలంగాణలోని కొత్త జిల్లాల వారీగా గేయాలె, కథా సంకలనాలను ‘బాల చెలిమి’ త్వరలో తేనుంది. 

‘ఆంధ్రప్రదేశ్‌ బడి పిల్లల కథలు’ పేర పదమూడు జిల్లాల వారీగా మన బడి పిల్లలు రాసిన కథలను సంకనాలుగా ప్రచురించాని బాలచెలిమి సంకల్పించింది. ఈ సంకలనాల కోసం ఆయా జిల్లాలలోని  బాలబాలికలు తమ స్వీయ రచనలను/కథలను పంపాల్సిందిగా కోరుతున్నాం. విజ్ఞానం, వినోదం, ఆనందం, మానవ సంబంధాలు, జీవజంతు జాలాలపై ప్రేమ, పర్యావరణ పరిరక్షణ వంటి వివిధ అంశాలపై కథలను ఆహ్వానిస్తున్నాం. 


తెల్ల కాగితంపై ఒకవైపునే  రెండు ఎ4 కాగితాలకు మించకుండా కథలు రాయాలి. రచయిత పేరు, తల్లితండ్రుల పేర్లు, పాఠశాల చిరునామాతో పాటు కథ వెంట ప్రధానోపాధ్యాయుడి ధ్రువ పత్రాన్ని జతపరచాలి. ఈ నెల 20వ తేదీ లోపు కింద తెలిపిన చిరునామాకు పంపించాలి. పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రశంసా పత్రం, పుస్తకం ఇవ్వడంతో పాటు, పాఠశాలకు కూడా పుస్తకాల సెట్‌ అందజేస్తాం. వివరాలకు బాలచెలిమి ప్రచురణలు, మొబైల్‌ నెం. 8686664949లో సంప్రదించవచ్చు. చిల్ర్డన్స్‌ ఎడ్యుకేషనల్‌ అకాడమి, భూపతి సదన్‌, 3–6–716, స్రీట్‌ నెం. 12, హిమాయత్‌ నగర్‌, హైదరాబాద్‌– 500029, తెలంగాణ.


– మణికొండ వేదకుమార్‌

సంపాదకులు, బాల చెలిమి & చిల్ర్డన్స్‌ ఎడ్యుకేషనల్‌ అకాడమి

Updated Date - 2020-03-06T06:06:30+05:30 IST