Jul 23 2021 @ 05:08AM

అరణ్మణై ప్రపంచానికి స్వాగతం

ఆర్య, రాశీఖన్నా జంటగా నటిస్తున్న తమిళ చిత్రం ‘అరణ్మణై 3’. విజయవంతమైన ‘అరణ్మణై’ ఫ్రాంచైజీలో వస్తున్న మూడో చిత్రం ఇది. హారర్‌ కామెడీ జానర్‌లో తెరకెక్కింది. సుందర్‌ సి ప్రధానపాత్రలో నటిస్తూ స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఇటీవలె ఈ సినిమా చిత్రీకరణ పూర్తయిందని కోలీవుడ్‌ సమాచారం. సెప్టెంబర్‌లో థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం సెన్సార్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. గురువారం ఈ సినిమా చిత్రీకరణలో దిగిన ఫొటోను రాశీఖన్నా సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేశారు. ‘మీ అందరికీ ‘అరణ్మణై 3’ ప్రపంచానికి స్వాగతం’ అని తెలిపారు. సాక్షి అగర్వాల్‌, యోగిబాబు కీలకపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సత్య సి. సంగీతం అందిస్తున్నారు. 


Otherwoodsమరిన్ని...