పేదల సంక్షేమమే సీఎం కేసీఆర్‌ లక్ష్యం

ABN , First Publish Date - 2021-08-02T05:37:46+05:30 IST

పేదల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్‌ రేయింబవళ్లు కృషి చేస్తు న్నారని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ అన్నారు. బోయినపల్లి మండల పరిషత్‌ కార్యా లయం ఆవరణలో ఆదివారం 127 మంది లబ్ధి దారులకు నూతన రేషన్‌ కార్డులను పంపిణీ చేశారు.

పేదల సంక్షేమమే సీఎం కేసీఆర్‌ లక్ష్యం
చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే

- ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌

బోయినపల్లి, ఆగస్టు 1: పేదల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్‌ రేయింబవళ్లు కృషి చేస్తు న్నారని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ అన్నారు. బోయినపల్లి మండల పరిషత్‌ కార్యా లయం ఆవరణలో ఆదివారం 127 మంది లబ్ధి దారులకు నూతన రేషన్‌ కార్డులను  పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బడు గు బలహీన వర్గాల భ్యున్నతి కోసం సీఎం కేసీ ఆర్‌ ఏ రాష్ట్రంలో లేని విధంగా పథకాలను ప్రవేశపెడుతున్నారన్నారు. దళిత బంధు ద్వారా వారి కుటుంబాలకు మేలు జరుగుతుందన్నారు. ఆసరా పిం ఛన్ల కోసం సంవత్స రానికి రూ.12 వేల కోట్లను ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. బీడుభూములకు సాగు నీరు అందించేందుకు కాళేశ్వరం   ప్రాజెక్ట్‌ను సకాలంలో పూర్తి చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుంద న్నారు. ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్‌, జడ్పీటీసీ ఉమ కొండయ్య, డిప్యూటీ తహసీల్దార్‌ నవీన్‌, ఎంపీడీవో రాజేందర్‌రెడ్డి, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 

చాకలి ఐలమ్మ పోరాట పటిమ ఎనలేనిది 

చాకలి ఐలమ్మ పోరాటపటిమ ఎనలేనిదని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ అన్నారు. బోయినపల్లి మండలం రత్నంపేట గ్రామంలో చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఎమ్మెల్యే రవిశంకర్‌, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు విమలక్క ఆవిష్కరించారు.  ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్‌, జడ్పీటీసీ ఉమ కొండయ్య, సర్పంచ్‌ రంగి రేణుకతిరుపతి, ఎంపీటీసీ రాజేశ్వరిస్వామి, ఎస్సీ సాధన సమితి అధ్యక్షురాలు కొత్లపల్లి శ్రీలక్ష్మి, నాయకులు అక్కరాజు శ్రీనివాస్‌, కోహెడ నాంపల్లి, రాగల్ల బాలయ్య, అంజయ్య, వెంకటేష్‌, బాలకిషన్‌, ప్రశాంత్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-08-02T05:37:46+05:30 IST