సంక్షేమ పథకాల అర్హులకు రుణ సదుపాయం

ABN , First Publish Date - 2020-12-04T05:01:00+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో అర్హతగలిగిన లబ్ధిదారులందరికి రుణ సదుపా యం కల్పించనున్నట్లు జిల్లా కలెక్టర్‌ సంప్రధింపుల కమిటీ చైర్మన్‌ సి. హరికిరణ్‌ తెలిపారు.

సంక్షేమ పథకాల అర్హులకు రుణ సదుపాయం
మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్‌ సి.హరికిరణ్‌ చిత్రంలో జేసీ సాయికాంత్‌ వర్మ

  10న వైఎస్సార్‌ చేయూత కింద గొర్రెలు, మేకలు పంపిణీ

15 లోపు బీమా నమోదు పక్రియ పూర్తి చేయాలి: కలెక్టర్‌

కడప(కలెక్టరేట్‌), డిసెంబరు 3: రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో అర్హతగలిగిన లబ్ధిదారులందరికి రుణ సదుపా యం కల్పించనున్నట్లు జిల్లా కలెక్టర్‌ సంప్రధింపుల కమిటీ చైర్మన్‌ సి. హరికిరణ్‌ తెలిపారు. గురువారం స్థానిక కలెక్టరేట్‌లోని తన ఛాంబరులో వైఎస్సార్‌ చేయూత, జగనన్న తోడు, స్వ యం ఉపాధి పథకం కింద మినీ ట్ర క్కుల పంపిణీ, వైఎస్సార్‌ బీమా పథకాలపై జిల్లా సంప్రధింపుల కమిటీ సమావేశం కలెక్టర్‌ అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమానికి జాయింట్‌ కలెక్టర్‌ సీఎం. సాయికాంత్‌ వర్మ హాజరయ్యారు. ఈ సంధర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో వైఎస్సార్‌ చేయూత పథకం కింద రూ. 18,750లను లబ్ధిదారుల ఖాతాల్లో జమచేసిందన్నారు. వారి జీవనోపాధులను మెరు గు పరిచేందుకు పాడి పశువులు, గొర్రెలు, మేకలను ప్రభుత్వం సబ్సిడీ ద్వారా అందించడం జరుగుతుందన్నారు. ఈ నెల 10వ తేదీలోగా 1500 యూనిట్లను ఎంపిక చేయనున్నట్లు కలెక్టర్‌ వెల్లడించారు.  పాడిరైతులందరికి కిసాన్‌ కిడ్రెట్‌కార్డులను పంపిణీ చేసేలా బ్యాంకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.  ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటికి రేషన్‌ పంపిణీ కార్యక్రమానికి సంబంధించి జిల్లాకు 514 ట్రక్కుల కొనుగోలు విషయంలో నిరుద్యోగులకు ఉపాధి కల్పించే దిశగా చర్యలు చేపట్టామన్నారు. వైఎస్సార్‌ బీమా పథకాలకు సంబంధించి వివరాలను నమోదును  15వ తేదీ లోపు పూర్తి చేయాలని బ్యాంకు అదికారులను కలెక్టర్‌ ఆదేశించారు ఈ కార్యక్రమంలో జిల్లా లీడ్‌ బ్యాకు మేనేజరుచంద్ర శేఖర్‌, మెప్మా పీడీ రామ్మోహన్‌రెడ్డి, పశుసంర్ధక శాఖ జేడీ సత్యప్రకాష్‌ , వివిద బ్యాంకుల మేనే జర్లు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-04T05:01:00+05:30 IST