సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శం

ABN , First Publish Date - 2022-01-19T04:11:22+05:30 IST

టీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. మంగళవారం రైతువేదిక వద్ద కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పేదింటి ఆడపిల్ల పెళ్లి ఖర్చులకు ఈ పథ కాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని తెలిపారు.

సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శం
కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య

భీమిని, జనవరి 18: టీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. మంగళవారం రైతువేదిక వద్ద కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పేదింటి ఆడపిల్ల పెళ్లి ఖర్చులకు ఈ పథ కాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని తెలిపారు. ఎంపీపీ రాజేశ్వరి లక్ష్మణ్‌, తహసీల్దార్‌ పరమేశ్వర్‌రెడ్డి, ఎంపీడీవో జవహర్‌, వైస్‌ఎంపీపీ  మధు, మండల రైతు సమన్వయ సమితి కన్వీనర్‌ ఓంప్రకాష్‌ గుప్తా,  ఎంపీటీసీ సంతోష్‌, పార్టీ మండల అధ్యక్షుడు నిరంజన్‌గుప్తా తదితరులు పాల్గొన్నారు. 

బెల్లంపల్లి: సీఎం కేసీఆర్‌ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆద ర్శంగా నిలుస్తున్నాయని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పేర్కొన్నారు. ఎమ్మెల్యే క్యాం పు కార్యాలయంలో 91 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. రైతుబంధు, బీమా, ఆసరా పింఛన్‌ తదితర సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్‌ అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌ నాయకులు టీఆర్‌ ఎస్‌ ప్రభుత్వంపై అసత్యపు ఆరోపణలు చేస్తున్నారని, ప్రజలు నమ్మవద్దని హితవు పలికారు. జడ్పీ వైస్‌చైర్మన్‌ సత్యనారాయణ, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌  శ్వేత, వైస్‌చైర్మన్‌సుదర్శన్‌, తహసీల్దార్‌ కుమారస్వామి, కౌన్సిలర్లు,  పాల్గొన్నారు. 

కన్నెపల్లి : టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రతి కుటుంబం లబ్ధిపొందుతుందని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పేర్కొన్నారు.  రైతువేదిక భవనంలో 41 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. కరోనా సంక్షోభంలో కూడా పథకాలను సమర్ధవంతంగా అమలు చేశా మన్నారు. జడ్పీటీసీ సత్యనారాయణ, సర్పంచులు పుల్లూరి సురేఖ, అశోక్‌గౌడ్‌, లక్ష్మీ, తహసీల్దార్‌ రాంచందర్‌, ఎంపీడీవో శంకరమ్మ,  నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-19T04:11:22+05:30 IST