సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా చూడాలి

ABN , First Publish Date - 2021-10-28T03:26:00+05:30 IST

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా కార్యకర్తలు కృషి చేయాలని ఎమ్మెల్యే దివాకర్‌రావు అన్నారు. జిల్లా కేంద్రంలో బుధవారం నిర్వహించిన నియోజకవర్గ స్ధాయి కార్యకర్తల విస్తృత స్థాయి సమా వేశంలో ఆయన మాట్లాడారు.

సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా చూడాలి
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే దివాకర్‌రావు

-ఎమ్మెల్యే దివాకర్‌రావు
ఏసీసీ, అక్టోబరు 27: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా కార్యకర్తలు కృషి చేయాలని ఎమ్మెల్యే దివాకర్‌రావు అన్నారు.  జిల్లా కేంద్రంలో బుధవారం నిర్వహించిన నియోజకవర్గ స్ధాయి కార్యకర్తల విస్తృత స్థాయి సమా వేశంలో ఆయన మాట్లాడారు. కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు ప్రజలతో నేరుగా సంబంధాలు కలిగి ఉన్నప్పుడే పార్టీకి, ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందన్నారు. పార్టీ చేపట్టే కార్యక్రమాలను గ్రామస్ధాయి నుంచి విజయవంతం చేయాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ పథకాలు చేపట్టిందన్నారు. సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో 20వ వార్షికోత్సవంలో అడుగుపెడుతున్న టీఆర్‌ఎస్‌ పార్టీ 60 ఏళ్ల చరిత్రను తిరగరాసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిందన్నారు. నవంబర్‌ 15న వరంగల్‌లో నిర్వహించతలపెట్టిన ద్విశతాబ్దోత్సవ సభకు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపుని చ్చారు.  సమావేశంలో మున్సిపల్‌ చైర్మన్‌ పెంట రాజయ్య, టీఆర్‌ఎస్‌ పట్టణాధ్యక్షుడు పల్లపు తిరుపతి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పల్లె భూమేష్‌, నస్పూర్‌ మున్సిపల్‌ చైర్మన్‌ ప్రభాకర్‌, సింగిల్‌ విండో చైర్మన్‌ వెంకటేష్‌, అత్తి సరోజ, గాదె సత్యం, తిప్పని లింగయ్య, మోట పలుకుల గురవయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-28T03:26:00+05:30 IST