సంక్షేమ పాఠశాలలకు అంబేడ్కర్‌ పేరు

ABN , First Publish Date - 2022-01-04T17:47:51+05:30 IST

రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమశాఖకు అనుబంధంగా ఉండే అన్ని రెసిడెన్షియల్‌ స్కూళ్లకు భారతరత్న డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ పేరు ఖరారు చేస్తూ ప్రభుత్వం సోమవారం ఆదేశాలు జారీ చేసింది. సాంఘిక సంక్షేమ శాఖకు

సంక్షేమ పాఠశాలలకు అంబేడ్కర్‌ పేరు

బెంగళూరు: రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమశాఖకు అనుబంధంగా ఉండే అన్ని రెసిడెన్షియల్‌ స్కూళ్లకు భారతరత్న డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ పేరు ఖరారు చేస్తూ ప్రభుత్వం సోమవారం ఆదేశాలు జారీ చేసింది. సాంఘిక సంక్షేమ శాఖకు అనుబంధంగా 1 నుంచి 5 తరగతుల విద్యార్థుల కోసం 66 రెసిడెన్షియల్‌ పాఠశాలలను తెరిచారు. వీటిలో 8500 మంది విద్యార్థులకు అవకాశం ఉంటుంది. సదరు రెసిడెన్షియల్‌ పాఠశాలలన్నీ అంబేడ్కర్‌ పేరుతో కొనసాగుతాయి. అంబేడ్కర్‌ పోరాటంతో పాటు దేశానికి ఆయన సాధనలను నేటి విద్యార్థులకు తెలిసేలా ఉండాలనే రెసిడెన్సియల్‌ పాఠశాలలకు ఆయన పేరు పెట్టినట్లు ప్రభుత్వం ప్రకటించింది. సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్‌ స్కూళ్లకు అంబేడ్కర్‌ పేరు పెట్టడం సంతోషకరమని దళిత సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.

Updated Date - 2022-01-04T17:47:51+05:30 IST