ప్రతిరోజూ కోటి మందికి టీకాలు: ప్రభుత్వం

ABN , First Publish Date - 2021-06-02T02:47:24+05:30 IST

టీకా కొరత లేదని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) మంగళవారం ప్రకటించింది. డిసెంబరు నాటికి మొత్తం జనాభాకు టీకాలు వేసే నమ్మకంతో...

ప్రతిరోజూ కోటి మందికి టీకాలు: ప్రభుత్వం

న్యూఢిల్లీ: టీకా కొరత లేదని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) మంగళవారం ప్రకటించింది. డిసెంబరు నాటికి మొత్తం జనాభాకు టీకాలు వేసే నమ్మకంతో ఉందని తెలిపింది. జూలై మధ్య లేదా ఆగస్టు నాటికి రోజూ ఒక కోటి మందికి టీకాలు వేయడానికి మాకు తగినంత డోసులు ఉంటాయని ఐసిఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరామ్ భార్గవ చెప్పారు. భారతదేశంలో ఇప్పటివరకు 21 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులను అందించారు.

Updated Date - 2021-06-02T02:47:24+05:30 IST