బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం

ABN , First Publish Date - 2020-08-06T16:18:36+05:30 IST

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది.

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం

విశాఖ: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. రానున్న రెండు రోజుల్లో ఇది బలహీనపడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో బుధవారం విజయనగరం, ఉభయగోదావరి, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో అనేక చోట్ల భారీ వర్షాలు కురిశాయి. 6, 7, 8, 9 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా ఓ మోస్తరు వర్షాలు, ఉత్తరాంధ్ర, యానాం, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది. ఈనెల 9న ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని తెలిపింది.

Updated Date - 2020-08-06T16:18:36+05:30 IST