కోల్‌క‌తా హైకోర్టులో మ‌మ‌తా స‌ర్కార్‌కు షాక్

ABN , First Publish Date - 2021-06-21T18:28:36+05:30 IST

మమతా సర్కార్‌కు కోల్‌కతా హైకోర్టు షాకిచ్చింది‌. ఎన్నిక‌ల త‌ర్వాత జరిగిన హింస‌పై కోర్టు ఆర్డ‌ర్‌ను రీకాల్ చేయాల‌ంటూ మ‌మ‌త స‌ర్కార్ విజ్ఞప్తి చేసింది.

కోల్‌క‌తా హైకోర్టులో మ‌మ‌తా స‌ర్కార్‌కు షాక్

కోల్‌కతా: మమతా సర్కార్‌కు కోల్‌కతా హైకోర్టు షాకిచ్చింది‌. ఎన్నిక‌ల త‌ర్వాత జరిగిన హింస‌పై కోర్టు ఆర్డ‌ర్‌ను రీకాల్ చేయాల‌ంటూ మ‌మ‌త స‌ర్కార్ విజ్ఞప్తి చేసింది. ప్ర‌భుత్వ విజ్ఞ‌ప్తిని ఉన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. హింసాత్మక ఘ‌ట‌న‌ల‌పై ఎన్‌హెచ్ఆర్‌సీలో విచార‌ణ కొన‌సాగుతున్న నేపథ్యంలో రీకాల్ చేయలేమని తెలిపింది. 


ఇదిలా ఉంటే, పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల తర్వాత చెలరేగిన హింసపై బాధితుల తరపున సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలైన విషయం తెలిసిందే. అయితే ఈ కేసు విచారణ నుంచి జడ్జి ఇందిరా బెనర్జీ తప్పుకున్నారు. బెంగాల్‌కు చెందిన వ్యక్తి కావడంతో ఆమె తప్పుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మరొక బెంచ్‌కు ఈ కేసును బదిలీ చేయనున్నారు. 

Updated Date - 2021-06-21T18:28:36+05:30 IST