తీవ్ర ఆగ్రహంతో మోదీకి లేఖ రాసిన మమత బెనర్జీ

ABN , First Publish Date - 2022-01-21T00:07:32+05:30 IST

కేంద్ర ప్రభుత్వం ఐఏఎస్ క్యాడర్ రూల్స్, 1954కు ప్రతిపాదించిన

తీవ్ర ఆగ్రహంతో మోదీకి లేఖ రాసిన మమత బెనర్జీ

కోల్‌కతా : కేంద్ర ప్రభుత్వం ఐఏఎస్ క్యాడర్ రూల్స్, 1954కు ప్రతిపాదించిన సవరణలపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది సహకార సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని మండిపడ్డారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పోస్టింగ్స్ విషయంలో కేంద్ర, రాష్ట్రాల మధ్య సామరస్య ఏర్పాటును తలకిందులు చేస్తుందని పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనను విరమించుకోవాలని కోరారు. ఈ మేరకు ఆమె ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి గురువారం ఓ లేఖ రాశారు. 


ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్) క్యాడర్ రూల్స్‌కు ప్రతిపాదించిన సవరణలు అత్యంత కిరాతకమైనవని అభివర్ణించారు. ఇవి మన సమాఖ్య విధానానికి, రాజ్యాంగ మౌలిక నిర్మాణానికి వ్యతిరేకమని ఆరోపించారు. ఇటువంటి సవరణలవల్ల అధికారుల్లో భయాందోళనలు ఏర్పడతాయన్నారు. ఈ ప్రతిపాదనను అమలు చేయవద్దని జనవరి 13న కూడా ఆమె మోదీకి ఓ లేఖ రాశారు. 


కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన సవరణలు అమల్లోకి వస్తే, రాష్ట్ర ప్రభుత్వాల అంగీకారంతో ఐఏఎస్ అధికారులను సెంట్రల్ డిప్యూటేషన్‌పై నియమించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి లభిస్తుంది. ఈ మేరకు ఐఏఎస్ క్యాడర్ రూల్స్, 1954లోని రూల్ 6లో ఓ ప్రావిజన్‌ను చేర్చేందుకు కేంద్రం ప్రతిపాదించింది. 


Updated Date - 2022-01-21T00:07:32+05:30 IST