హౌరా రూరల్ ఎస్పీపై ఈసీ వేటు

ABN , First Publish Date - 2021-03-09T17:32:17+05:30 IST

పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా హౌరా రూరల్ ఎస్పీ సౌమ్యారాయ్ పై కేంద్ర ఎన్నికల కమిషన్

హౌరా రూరల్ ఎస్పీపై ఈసీ వేటు

హౌరా : పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా హౌరా రూరల్ ఎస్పీ సౌమ్యారాయ్ పై కేంద్ర ఎన్నికల కమిషన్ (ఈసీ) తొలగించింది.దక్షిణ 24 పరగణాస్ జిల్లా సోనాపూర్ దక్షిణ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎస్పీ రాయ్ భార్య, సినీనటి లవ్లీ మైత్రా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినిగా ఎన్నికల బరిలోకి దిగారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల కుటుంబసభ్యులు ఎన్నికల నిర్వహణలో ఉండరాదనే నిబంధన మేర తాము రూరల్ ఎస్పీ రాయ్ ను తొలగించామని ఈసీ కార్యాలయం పేర్కొంది. లవ్లీ మిత్రా ఎన్నికల్లో పోటీ చేస్తున్నందున తాము సౌమ్యారాయ్ ను తొలగించామని ఈసీ జారీ చేసిన వివరణలో వెల్లడించింది. లవ్లీ మైత్రా టీఎంసీ అభ్యర్థినిగా ప్రకటించగానే హౌరా రూరల్ ఎస్పీగా రాయ్ ఎలా కొనసాగుతారని పలువురు గతంలో ప్రశ్నించారు.

Updated Date - 2021-03-09T17:32:17+05:30 IST