బెంగాల్‌లో సం‘కుల’ సమరం

ABN , First Publish Date - 2021-04-15T09:09:03+05:30 IST

క్షణక్షణం ఉద్రిక్తలతో కొనసాగుతున్న పశ్చిమబెంగాల్‌ రణక్షేత్రంలో ఇప్పటికే నాలుగు దశల పోలింగ్‌ పూర్తయింది. మరో నాలుగు దశలు మిగిలి ఉన్నాయి. ఇన్నాళ్లూ ఒక ఎత్తు. ఇక నుంచి మరొకటి.. బెంగాల్‌ అనగానే అందరికీ

బెంగాల్‌లో సం‘కుల’ సమరం

దళిత ఓట్లే గేమ్‌ ఛేంజర్‌.. మూడో వంతుకు పైగా సీట్లలో కీలకం.. పోటాపోటీగా పార్టీల వల


కోల్‌కతా, ఏప్రిల్‌ 14: క్షణక్షణం ఉద్రిక్తలతో కొనసాగుతున్న పశ్చిమబెంగాల్‌ రణక్షేత్రంలో ఇప్పటికే నాలుగు దశల పోలింగ్‌ పూర్తయింది. మరో నాలుగు దశలు మిగిలి ఉన్నాయి. ఇన్నాళ్లూ ఒక ఎత్తు. ఇక నుంచి మరొకటి.. బెంగాల్‌ అనగానే అందరికీ మొదట గుర్తుకొచ్చేది పెద్ద ఎత్తున(27.4%) ఉన్న ముస్లిం ఓటుబ్యాంకు. అయితే ఈ సారి ముస్లిం ఓటుబ్యాంకు టీఎంసీ, కాంగ్రె్‌స-లె్‌ఫ్ట-ఐఎ్‌సఎఫ్‌ కూటమి, మజ్లిస్‌ మొదలైన పార్టీల మధ్య చీలిపోయే అవకాశాలున్నాయి. దీని కంటే ఎక్కువగా ప్రభావం చూపగల ఓటుబ్యాంకు దళితులు. మొత్తం 294 అసెంబ్లీ స్థానాలకు గాను, నేరుగా 110 సీట్లలో ఫలితాన్ని తారుమారు చేయగల సత్తా దళితులది. దేశంలోనే అతి ఎక్కువగా దళితులు ఉన్న మూడో రాష్ట్రం బెంగాల్‌. మొత్తం ఓటర్లలో 23.51% ఎస్సీలే. వీరిలో రాజ్‌బంశీలు(18.4%), నామశూద్రులు(17.4%), బాగ్డీలు(14%) ప్రధానంగా ఉన్నారు. 


ఈ మూడు ఉపకులాలకు చెందిన వారే 1.7 కోట్ల మంది ఓటర్లు. పాడ్‌ (12%), బౌరీ (5.9), చమార్లు (5.4%) కూడా ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. నామశూద్రుల్లో ఎక్కువ మంది మథువాలు. ఒకప్పుడు తూర్పు పాకిస్థాన్‌లో ఉన్న వీరంతా బంగ్లాదేశ్‌ ఏర్పడ్డాక బతుకుతెరువు కోసం బెంగాల్‌కు వచ్చిన శరణార్థులు. కనీసం 40 నియోజకవర్గాల్లో మథువాల ఓటే ఫలితాన్ని నిర్దేశిస్తుంది. ఓటర్లలో 5.5ు ఎస్టీలు కూడా ఉన్నారు. ‘దళితులు ‘గేమ్‌ ఛేంజర్‌’ అని మొదట గుర్తించినది బీజేపీ. ఎస్సీల్లోని 60 వర్గాలవారు 9 జిల్లాల్లో 25% పైనే ఉన్నారు. ఈ 9 జిల్లాల్లోని 117 అసెంబ్లీ సెగ్మెంట్లలో వీరి ఓటు కీలకం. మరో 6 జిల్లాల్లోని 78 నియోజకవర్గాల్లో వీరు 15-20ు ఉన్నారు. దళితులకు బీజేపీ 2019 ఎన్నికల్లో గాలం వేసింది. రాష్ట్రంలోని 68 ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాలకు 33 సెగ్మెంట్లలో బీజేపీ ఆధిక్యత కనబర్చగా, టీఎంసీ నాడు 34చోట్ల ముందంజ వేసింది. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఏకంగా 50 సీట్లను కైవసం చేసుకుంది. నాడు కాంగ్రెస్‌-లెఫ్ట్‌లకు 18 లభించగా బీజేపీకి ఒక్క సీటూ దక్కలేదు. 2019లో బీజేపీకి అనుకూలంగా ఎస్సీ-ఎస్టీ ఓటు స్వింగ్‌ కావడంతో బెంగాల్‌లో మతరాజకీయంతో పాటు కులరాజకీయాన్ని కూడా బీజేపీ ప్రయోగించింది. ఈ ఎన్నికల్లో మొత్తం 64 మంది ఎస్సీలను, 11 మంది ఎస్టీలను బరిలోకి దింపింది. తృణమూల్‌ కూడా 79 నియోజకవర్గాల్లో ఎస్సీలను దింపింది. మరో 6 సీట్లు ఎస్టీలకు ఇచ్చింది. అధికారంలోకొస్తే మహిష్యా, తెలి, తముల్‌, సాహా ఉపకులాల వారిని ఓబీసీ జాబితాలో చేరుస్తామని రెండు పార్టీలూ హామీ ఇస్తున్నాయి. 

 

సుజాతా మండల్‌ వ్యాఖ్యతో సంకటం!

దళితులందరిదీ బిచ్చగాళ్ల మనస్తత్వమన్న సుజాత్‌ మండల్‌ ఖాన్‌ అనే టీఎంసీ నేత వ్యాఖ్యతో తృణమూల్‌ ఇబ్బందుల్లో పడింది. బీజేపీ దీన్ని వెంటనే సొమ్ము చేసుకోవడం మొదలెట్టింది. ‘‘మమత ప్రోద్బలం లేకుండానే సుజాతా ఖాన్‌ ఆ వ్యాఖ్యలు చేశారంటే నమ్మగలమా? మమత క్షమాపణ కూడా చెప్పలేదు. తృణమూల్‌ దళితుల్ని అవమానించింది. దశాబ్దాల తరబడి వారిని బిచ్చగాళ్లుగానే చూసింది. వారి అభ్యున్నతికి చేసింది శూన్యం’’ అని ప్రధాని మోదీ ఎన్నికల సభల్లో తీవ్రంగా విమర్శించారు. 


బీజేపీకి 70 సీట్లు మించవు: మమత

ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 70 సీట్లు మించి రావని టీఎంసీ అధినే త్రి మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. ‘‘ఇప్పటికే ముగిసిన 4 దశల ఎన్నికల్లో 135 సీట్లకు గాను బీజేపీ సెంచరీ కొట్టేసిందని ప్రధాని మోదీ చెప్పుకుంటున్నారు. నేను చెబుతున్నా.. ఎన్నికలు పూర్తయ్యేవేళకు 294 సీట్లలో బీజేపీ సంఖ్య 70కి మించదు. ఇది ఖాయం’’ అని ఆమె బుధవారం జల్పాయ్‌గురి జిల్లాలో జరిగిన ఎన్నికల సభల్లో అన్నారు. ‘‘కొవిడ్‌ కేసులు పెరగడానికి బీజేపీయే కారణం. వ్యాక్సిన్‌ సరఫరా చేయాలనీ, అందరికీ ఇచ్చే అవకాశం ఇవ్వాలని మేం కోరుతూంటే.. బీజేపీ ఇతర రాష్ట్రాల నుంచి సంఘ విద్రోహకర శక్తులను తెచ్చి ప్రచారానికి దింపుతోంది. వారి వల్లే కొవిడ్‌ వ్యాప్తి జరుగుతోంది’’ అని ఆమె ఆరోపించారు. 

Updated Date - 2021-04-15T09:09:03+05:30 IST