Advertisement
Advertisement
Abn logo
Advertisement
Nov 5 2021 @ 07:10AM

పశ్చిమబెంగాల్ మంత్రి సుబ్రత ముఖర్జీ కన్నుమూత

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్  రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి,తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేత, సుబ్రతా ముఖర్జీ (75) గురువారం గుండెపోటుతో కన్నుమూశారు. సుబ్రతా ముఖర్జీకి గుండెపోటు రావడంతో అతన్ని ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఎస్ఎస్కేఎం ఆసుపత్రిలో చేర్చారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ముఖర్జీకి గురువారం రాత్రి మళ్లీ గుండెపోటు రావడంతో మరణించారు. మంత్రి ముఖర్జీ మృతి తనకు తీరని లోటని బెంగాల్ సీఎం మమతాబెనర్జీ చెప్పారు. ‘‘నేను జీవితంలో చాలా విషాదాలను చూశాను, కానీ ఇది చాలా పెద్ద నష్టం, ముఖర్జీ రేపు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతానని నాకు చెప్పారు. కాని ఆకస్మికంగా మరణించారు’’ అని మమతా బెనర్జీ అన్నారు.

సుబ్రతా ముఖర్జీ కోల్ కత్తా మున్సిపల్ కార్పొరేషన్‌కు మొదటి మేయర్. టీఎంసీలో చేరడానికి ముందు సుబ్రతా ముఖర్జీ ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు. ముఖర్జీ ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలకు సన్నిహితుడిగా పేరొందారు. మంత్రి ముఖర్జీ మృతిపట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.


ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement