బట్టల దుకాణంలో దూరిన నాలుగడుగుల తాచుపాము
ABN , First Publish Date - 2021-07-15T14:42:11+05:30 IST
పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం రామచంద్రపురం సమీపంలోని ఓ బట్టలు దుకాణంలో
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం రామచంద్రపురం సమీపంలోని ఓ బట్టలు దుకాణంలో నాలుగు అడుగుల తాచుపాము కలకలం రేపుతోంది. పాముని గమనించిన షాపు సిబ్బంది భయంతో బయటకు పరుగులు తీశారు. పాముని చంపకుండా పాముల సంరక్షకుడు చదలవాడ క్రాంతికి స్థానికులు సమాచారం అందించారు. దీంతో క్రాంతి అక్కడకు చేరుకుని ఎంతో చాకచక్యంగా తాచుపామును పట్టుకుని అడవిలోకి వదిలేశారు.