Abn logo
Jan 27 2021 @ 11:20AM

రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి

పశ్చిమ గోదావరి: ప్రమాదవశాత్తు రైలు ఢీకొని గుర్తు తెలియని యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు రైల్వేస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. అనుమానస్పదంగా పడివున్న బాడీని చూసిన స్థానికులు..పోలీసులకు సమాచారం అందించారు. ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement
Advertisement