8న బౌద్ధ దమ్మ పీఠంలో శాటిలైట్‌ డెంటల్‌ క్లినిక్‌

ABN , First Publish Date - 2021-03-04T04:46:45+05:30 IST

ఉండ్రాజవరం బౌద్ధ దమ్మ పీఠంలో 8వ తేదీన విష్టు డెంటల్‌ కళాశాల ఆధ్వర్యంలో శాటిలైట్‌ డెంటల్‌ క్లినిక్‌ ప్రారంభిస్తున్నట్టు పీఠాధిపతి అనాలయో బుధవారం తెలిపారు.

8న బౌద్ధ దమ్మ పీఠంలో శాటిలైట్‌ డెంటల్‌ క్లినిక్‌

ఉండ్రాజవరం, మార్చి 3 : ఉండ్రాజవరం బౌద్ధ దమ్మ పీఠంలో  8వ తేదీన విష్టు డెంటల్‌ కళాశాల ఆధ్వర్యంలో శాటిలైట్‌ డెంటల్‌ క్లినిక్‌ ప్రారంభిస్తున్నట్టు పీఠాధిపతి అనాలయో బుధవారం తెలిపారు. కాలేజీ వారి 27వ శాటిలైట్‌ డెంటల్‌ క్లినిక్‌ సెంటర్‌ను ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తుందన్నారు. పరమహంస యోగానంద నేత్ర వైద్యశాల ఆధ్వర్యంలో ప్రతి నెలా 3వ సోమవారం కంటిపరీక్షలు, క్యాటరాక్ట్‌ ఆపరేషన్లు చేస్తారన్నారు. ప్రతి ఆదివారం  బాలవికాస్‌ స్కూలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి రోజూ సాయంత్రం 6.30 నుంచి 7.30 గంటల వరకు ధ్యానం నేర్పిస్తున్నట్టు చెప్పారు.  

Updated Date - 2021-03-04T04:46:45+05:30 IST