చిన వెంకన్న ఆలయ ఈవోగా సుబ్బారెడ్డి

ABN , First Publish Date - 2021-03-04T04:41:09+05:30 IST

ద్వారకాతిరుమల వెంకటేశ్వరస్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా డిప్యూటీ కలెక్టర్‌ జీవీ సుబ్బారెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు.

చిన వెంకన్న ఆలయ ఈవోగా సుబ్బారెడ్డి
ఈవోకు జ్ఞాపిక అందజేస్తున్న అర్చకుడు

ద్వారకాతిరుమల, మార్చి 3 : ద్వారకాతిరుమల వెంకటేశ్వరస్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా డిప్యూటీ కలెక్టర్‌ జీవీ సుబ్బారెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ముందుగా స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు ఆశీ ర్వచనాలు పలికి ప్రసాదాలు అందించారు.ఈవో సుబ్బారెడ్డిని దేవాలయ సిబ్బంది మర్యాదపూర్వకంగా కలుసుకుని స్వాగతం పలికారు.  

Updated Date - 2021-03-04T04:41:09+05:30 IST