గ్రామ రక్షక దళాల ఏర్పాటు : డీఐజీ

ABN , First Publish Date - 2021-01-20T05:50:50+05:30 IST

ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ప్రవర్తించే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటున్నామని ఏలూరు రేంజ్‌ డీఐజీ కేవీ మోహనరావు చెప్పారు.

గ్రామ రక్షక దళాల ఏర్పాటు : డీఐజీ
వీడియో కాన్ఫరెన్సులో డీఐజీ మోహనరావు

ఏలూరు క్రైం, జనవరి 19: ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ప్రవర్తించే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటున్నామని ఏలూరు రేంజ్‌ డీఐజీ కేవీ మోహనరావు చెప్పారు. డీజీపీ గౌతమ్‌సవాంగ్‌ మంగళవారం అన్ని జిల్లాల ఎస్పీలు, డీఐజీలు, కమీషనర్లతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహిం చారు. డీఐజీ మోహనరావు మాట్లాడుతూ ఏలూరు రేంజ్‌లోని అన్ని దేవాల యాలు, చర్చిలు, మసీదుల వద్ద భద్రతా ఏర్పాట్లకు సంబంధించి ఎస్పీలు, డీఎస్పీలతో ప్రత్యక్షంగా వీడియో కాన్ఫరెన్సు ద్వారా మాట్లాడి అన్ని చర్యలు చేపట్టామన్నారు. కొన్ని దేవాలయాలపై జరిగిన దాడులకు సంబంధించి కొందరిని అరెస్ట్‌ చేశామన్నారు. రేంజ్‌ పరిధిలో గ్రామ రక్షక దళాలు 5,327 ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 


సోషల్‌ మీడియాలో అసత్యప్రచారం.. కేసు నమోదు : ఎస్పీ

మత సామరస్యానికి విఘాతం కలిగించే విధంగా సోషల్‌ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసినట్టు ఎస్పీ కె.నారా యణనాయక్‌ తెలిపారు. 2014లో ఏలూరులోని ఓ ఆలయంలో జరిగిన ఘట నపై పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడైన పెరకా వెంకటేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్‌ చేశారు. కోర్టులో హాజరు పర్చగా 2015లో అతనికి కారా గార శిక్ష విధించింది. ఈ ఘటనను ఆధారంగా తీసుకుని తాజాగా ఆంజనే యస్వామి విగ్రహం ధ్వంసమైందని ఏలూరుకు చెందిన రామనపూడి శివప్ర సాద్‌ అనే వ్యక్తి సోషల్‌ మీడియాలో తప్పుడు పోస్టుచేశారు. అసత్య ప్రచారం చేసినందుకు శివప్రసాద్‌పై వన్‌టౌన్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు ఎస్పీ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఎవరైనా అసత్య ప్రకటనలు పోస్టు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

Updated Date - 2021-01-20T05:50:50+05:30 IST