Abn logo
Jul 21 2021 @ 14:45PM

గోల్డ్ స్కీమ్, చిట్స్ పేరుతో మోసం

ప.గో.జిల్లా: ఓ బంగారం వ్యాపారి మోసం చేశాడంటూ పశ్చిమ గోదావరి జిల్లా, ద్వారకా తిరుమలలో స్థానికులు ఆందోళనకు దిగారు. గోల్డ్ స్కీమ్, చిట్స్ పేరుతో నిండా ముంచాడని ఆరోపించారు. శ్రీ వెంకట గణేష్ జ్యూవెలరీ యజమాని రాజా కొంతకాలంగా గోల్డ్ స్కీమ్ పేరుతో కస్టమర్లను ఆకర్షించాడు. 15 నెలలపాటు నెలకు రూ.2వేల చొప్పున రూ. 30వేలు చెల్లిస్తే 16వ నేల బొనస్‌గా మరో రెండువేలు కలిపి రూ. 32 వేలకు బంగారం గానీ, వెండి వస్తువులు గానీ ఇస్తామంటూ నమ్మబలికాడు. ఆయన మాటలు నమ్మిన స్థానికులు పెద్ద ఎత్తున వాయిదాలు కట్టారు. అయితే స్కీమ్ ముగుస్తున్న తరుణంలో రాజా తన కుంటుంబంతో పారిపోయాడు.


బాధితులు 2 వందల మంది వరకు ఉంటారని రూ. మూడున్నర కోట్లకుపైగా కుచ్చిటోపీ పెట్టి ఉంటాడని అంటున్నారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.