మంచు కప్పేసింది

ABN , First Publish Date - 2022-01-22T06:04:23+05:30 IST

జిల్లాను మంచు దుప్పటి కప్పేసింది.

మంచు కప్పేసింది
మంచు ముసుగులో ద్వారకాతిరుమల చిన వెంకన్న ఆలయం

  పెరిగిన చలి.. జనం గజ..గజ
ఏలూరు సిటీ, జనవరి 21: జిల్లాను మంచు దుప్పటి కప్పేసింది. శుక్రవారం తెల్లవారు జాము నుంచి విపరీతమైన మంచు కురిసింది. ఉదయం ఎనిమిది గంటలు దాటినా మంచు తెరలు తొలగి పోలేదు. ఆర్టీసీ బస్సులు, ద్విచక్ర వాహనదారులు రహదారులు కనబడక ఇబ్బందులు పడ్డారు. జన సంచారం కూడా తగ్గింది. రాత్రి పూట ఉష్ణోగ్రతలు కనిష్టస్థాయికి పడిపోవడంతో నాలుగు రోజు లుగా చలి పెరిగింది. పగటి పూట 30 నుంచి 33 వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నా రాత్రి వేళల్లో మాత్రం 16 నుంచి 17 డిగ్రీల సెంటీగ్రేడ్‌ నమోదవుతున్నాయి. చలి గాలులకు జలుబు, జ్వరం, దగ్గు వంటి అనారోగ్యాలతో ఇబ్బంది పడుతున్నారు. కరోనా విజృంభిస్తున్న తరుణంలో చిన్న జ్వరం వచ్చినా ప్రజలు భయపడిపోతున్నారు. చలి గాలుల తీవ్రత మరికొన్ని రోజులు కొనసాగుతుంది. ఈ సమయంలో బయట తిరగవద్దని వైద్యులు చెబుతున్నారు.  

Updated Date - 2022-01-22T06:04:23+05:30 IST