కాపు కల్యాణ మండపాలు నిర్మించండి

ABN , First Publish Date - 2021-02-25T05:06:39+05:30 IST

కాపు సామాజిక వర్గానికి 529 కాపు కల్యాణ మండపాలు నిర్మించడానికి గత ప్రభుత్వ హయాంలో మంజూరు చేసిన నిధులు ప్రస్తుత ప్రభుత్వం నిలుపుదల చేయడం తగదని మాజీ ఎంపీ, కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి వెంకట హరరామ జోగయ్య అన్నారు.

కాపు కల్యాణ మండపాలు నిర్మించండి

సీఎం జగన్‌ను కోరిన మాజీ ఎంపీ జోగయ్య

పాలకొల్లు, ఫిబ్రవరి 24 : కాపు సామాజిక వర్గానికి 529 కాపు కల్యాణ మండపాలు నిర్మించడానికి గత ప్రభుత్వ హయాంలో  మంజూరు చేసిన నిధులు ప్రస్తుత ప్రభుత్వం నిలుపుదల చేయడం తగదని మాజీ ఎంపీ, కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి వెంకట హరరామ జోగయ్య అన్నారు. ఈ మేరకు సీఎం జగన్‌కు లేఖ రాశారు. ఈ లేఖపై ప్రభుత్వ చీఫ్‌ సెక్రటరీ (బీసీ వెల్ఫేర్‌ డిపార్టుమెంట్‌) ఎస్‌ఎన్‌ రావు బదులిచ్చారు. 25 శాతం నిర్మాణ దశలో ఉన్న పనులు నిలుపుదల చేశామని.. అసలు పని ప్రారంభించనవి రద్దు చేశామని నిర్మాణం పూర్తి చేయడానికి 69 భవనాలకు మాత్రమే అర్హత ఉందని తమ శాఖ దర్యాప్తులో తేలినట్టు   పేర్కొన్నారు. దీనిపై జోగయ్య స్పందిస్తూ కాపు సామాజిక భవనాల నిర్మాణాలు వివిధ కారణాలతో నిలిపి వేయడం పద్ధతి కాదన్నారు. ఇప్పటికైనా కాపు సంక్షేమ భవనాలను త్వరితంగా నిర్మించాలని సూచించారు. 

Updated Date - 2021-02-25T05:06:39+05:30 IST