ఇలా అయితే రాదా..!?

ABN , First Publish Date - 2020-03-30T09:26:31+05:30 IST

కొండనాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిన చందంగా చౌక డిపోల వద్ద రేషన్‌ సరుకుల పంపిణీ

ఇలా అయితే రాదా..!?

పెరవలి గ్రామీణ, మార్చి 29: కొండనాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిన చందంగా చౌక డిపోల వద్ద రేషన్‌ సరుకుల పంపిణీ వ్యవహారం మారింది. బయోమెట్రిక్‌ పద్ధతిలో వేలిముద్రలు వేయించుకుని సరుకులు ఇస్తే  వైరస్‌ సోకే ప్రమాదం ఉందని కొద్దిపాటి మార్పులు చేశారు. స్పష్టమైన ఆదేశాలు లేకపోవడంతో చౌకడిపోల వద్ద గందరగోళ పరిస్థితి ఏర్పడింది.


ప్రతీ లబ్ధిదారుడు రిజిస్టర్‌లో సంతకం చేయాలని, లేకుంటే వేలిముద్ర వేయాల్సి ఉంటుందని చెప్పడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ఒకరు ముట్టుకున్న పెన్ను వందలాది మంది ముట్టుకోవడం ద్వారా వైరస్‌ వ్యాప్తి చెందదా అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.తహసీల్దార్‌ పద్మావతిని వివరణ కోరగా వేలిముద్రలు వేయవద్దని ఆదేశాలు ఇచ్చామని సంతకాలు తీసుకోవాలని చెప్పామన్నారు. సంతకం పెట్టకపోతే ఫొటో తీసుకుని ఇవ్వాల్సిందిగా ఆదేశించామన్నారు.

Updated Date - 2020-03-30T09:26:31+05:30 IST