Abn logo
May 3 2021 @ 09:41AM

బొలేరో ఢీకొని ఇద్దరు మృతి

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా పోలవరం మండలం ప్రగడపల్లి సమీపంలో సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. బొలెరో ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతులు తూర్పుగోదావరి జిల్లా సీతానగరంకు చెందిన వ్యవసాయ కూలీలు ధారా కాంతారావు, కొండేపూడి నాగరాజుగా గుర్తించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Advertisement
Advertisement
Advertisement