బుట్టాయగూడెం జూనియర్ కళాశాలలో ఆటల పోటీలు

ABN , First Publish Date - 2022-01-22T02:29:08+05:30 IST

బుట్టాయగూడెం (పశ్చిమ గోదావరి): పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని టీబీకె యూత్‌ ఆధ్వర్యంలో

బుట్టాయగూడెం జూనియర్ కళాశాలలో ఆటల పోటీలు

బుట్టాయగూడెం (పశ్చిమ గోదావరి): పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు జన్మదినోత్సవాన్ని (జనవరి 26) పురస్కరించుకుని టీబీకె యూత్‌ ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా  బుట్టాయిగూడెం జూనియర్‌ కళాశాల క్రీడా మైదానంలో ఆటలు పోటీలు ప్రారంభించారు. ఈ పోటీలను జిల్లా పరిషత్‌ చైర్మన్‌ కవురు శ్రీనివాస్‌ ప్రారంభించారు. వాలీబాల్, కబడ్డీ, విలువిద్య, ఆటల పోటీలను నిర్వహించారు. ఈ పోటీలను జిల్లా పరిషత్‌ చైర్మన్‌ కవురు శ్రీనివాస్, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, గోపాలపురం ఎమ్మెల్యే తలారీ వెంకట్రావు తదితరులు వీక్షించారు. ఈ సందర్బంగా కవురు శ్రీనివాస్‌ మాట్లాడుతూ క్రీడల వల్ల శారీరక ఆరోగ్యంతో పాటు, మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయన్నారు. క్రీడాభివృద్దికి, విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుందన్నారు. పోలవరం నియోజకవర్గంలో ఉన్న ఏడు మండలాలకు ఒకో మండలానికి కోటి రూపాలయ నిధులు జెడ్పీ నిధుల నుంచి ఈనెలలో కేటాయిస్తామని శ్రీనివాస్‌ చెప్పారు. 



Updated Date - 2022-01-22T02:29:08+05:30 IST