Abn logo
Jan 16 2021 @ 00:54AM

మొత్తం ఓటర్లు 33,00,625

తుది జాబితా విడుదల

కొత్త ఓటర్లు 52,510.. మహిళా ఓటర్లదే పైచేయి

జిల్లాలో మహిళా ఓటర్లు 16,80,745

పురుష ఓటర్లు 16,19,584... ఇతరులు – 295 

ఏలూరు, జనవరి 15(ఆంధ్రజ్యోతి):జిల్లాలో ఓటర్ల సంఖ్య 33 లక్షల మార్కును దాటింది. ఈ ఏడాది కొత్తగా 52,510 మంది ఓటు హక్కు పొందారు. ఓటర్ల తుది జాబితాను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ముత్యాలరాజు శుక్రవారం విడుదల చేశారు. డిసెంబరులో విడుదల చేసిన ముసాయిదా జాబితా ప్రకారం జిల్లాలోని మొత్తం ఓటర్ల సంఖ్య 32,59,135 కాగా చివరి నెలలో దాదాపు 40 వేల మంది ఓటు హక్కు పొందడం విశేషం. తాజా జాబితాలో కూడా మహిళలదే పైచేయి. మొత్తం 33,00,625 ఓటర్లలో 16,19,584 మంది పురుష ఓటర్లు ఉండగా మహిళలు 16,80,745 మంది ఉన్నారు. 295 మంది ట్రాన్స్‌జెండర్లు, 1,773 మంది సర్వీసు ఓటర్లు ఉన్నారు.


నియోజకవర్గం పురుషులు మహిళలు ఇతరులు మొత్తం

కొవ్వూరు 89,145 93,531 10 1,82,686

నిడదవోలు 1,02,071 1,05,474 7 2,07,552

ఆచంట 89,461 91,179 3 1,80,643

పాలకొల్లు 96,885 1,00,018 13 1,96,916

నరసాపురం 86,544 87,756 1 1,74,301

భీమవరం 1,23,129 1,29,459 102 2,52,690

ఉండి 1,11,411 1,14,868 12 2,26,291

తణుకు 1,16,581 1,22,092 8 2,38,681

తాడేపల్లిగూడెం 1,05,375 1,09,705 16 2,15,096

ఉంగుటూరు 1,01,734 1,03,774 8 2,05,516

దెందులూరు 1,10,726 1,14,609 9 2,25,344

ఏలూరు 1,13,891 1,25,389 37 2,39,317

గోపాలపురం 1,17,734 1,19,777 13 2,37,524

పోలవరం 1,21,851 1,28,103 14 2,49,968

చింతలపూడి 1,33,046 1,35,012 42 2,68,100

మొత్తం 16,19,584 16,80,746 295 33,00,625

కొత్తగా దరఖాస్తు చేసుకున్న సమయం: నవంబరు 16 నుంచి డిసెంబరు 15 వరకు

ప్రత్యేక ప్రచార తేదీలు : నవంబరు 28,29 ; డిసెంబరు 12,13 

తుది ఓటర్ల జాబితా: జనవరి 15


Advertisement
Advertisement
Advertisement