క్షేత్ర పరిశీలనలు చేయండి : గోపికృష్ణ

ABN , First Publish Date - 2021-02-25T05:09:21+05:30 IST

క్షేత్ర పరిశీలనలు.. ప్రఽథమ శ్రేణి ప్రదర్శనలు, వృత్తి విద్యా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యా లయం (గుంటూరు) ప్రధాన శాస్త్రవేత్త డా.టి.గోపికృష్ణ అన్నారు.

క్షేత్ర పరిశీలనలు చేయండి : గోపికృష్ణ
వ్యవసాయంపై సమీక్షిస్తున్న శాస్త్రవేత్తలు

 ఉండి, ఫిబ్రవరి 24 : క్షేత్ర పరిశీలనలు.. ప్రఽథమ శ్రేణి ప్రదర్శనలు, వృత్తి విద్యా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యా లయం (గుంటూరు) ప్రధాన శాస్త్రవేత్త డా.టి.గోపికృష్ణ అన్నారు. ఉండి కృషి విజ్ఞాన కేంద్రంలో బుధవారం జరిగిన శాస్త్రీయ సలహా సంఘ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతీ శాస్త్రవేత్త సంఘ సభ్యులు చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకుని కార్యాచరణ రూపొందించాలన్నారు. డాక్టర్‌ జి.జోగినా యుడు మాట్లాడుతూ ప్రతీ సంవత్సరం పంట కాలానికి ముందు సలహా సంఘ సభ్యులు సమావేశమై ప్రణాళికా తయారుచేయాలన్నారు.ఈ కార్యక్రమంలో వ్యవ సాయశాఖ డీడీ జగ్గారావు, ఆత్మ పీడీ బీవీఎస్‌ఎస్‌.హరి, మత్స్య పరిశోధన స్థానం అధిపతి సుగుణ, వి.సత్యనారాయణ, శాస్త్రవేత్తలు రమేష్‌బాబు, బీవీఎస్‌ఎన్‌.రవి కుమార్‌, కేవీకే వెంకట్రామన్నగూడెం అధిపతి ఇ.కరుణశ్రీ పాల్గొన్నారు. 

Updated Date - 2021-02-25T05:09:21+05:30 IST