ఆరోగ్యశ్రీ ఆసుపత్రుల్లోనూ.. కొవిడ్‌ టీకా

ABN , First Publish Date - 2021-03-04T05:27:42+05:30 IST

జిల్లాలోని అన్ని ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆసు పత్రుల్లో కొవిడ్‌ టీకా పంపిణీ శనివారం లేదా సోమవారం నుంచి ప్రారంభం కానుంది.

ఆరోగ్యశ్రీ ఆసుపత్రుల్లోనూ.. కొవిడ్‌ టీకా
ఆచంటలో మంత్రికి వ్యాక్సిన్‌

మంత్రి రంగనాథరాజు, కలెక్టర్‌ ముత్యాలరాజుకు వ్యాక్సిన్‌

ఏలూరు ఎడ్యుకేషన్‌, మార్చి 3 : జిల్లాలోని అన్ని ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆసు పత్రుల్లో కొవిడ్‌ టీకా  పంపిణీ శనివారం లేదా సోమవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు రాష్ట్ర అధికారుల నుంచి ఆదేశాలందాయి. ప్రస్తుతం మూడో దశ టీకా పంపిణీ జిల్లాలో ఎంపిక చేసిన ప్రభుత్వాసుపత్రుల్లో జరుగుతుండగా, మరో ఏడు ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆసుపత్రు లకు బుధవారం నుంచి ఐదు ఆసుప త్రుల్లో మాత్రమే ప్రారంభమైంది. ప్రిరి జిస్ట్రేషన్‌ ద్వారా నెట్‌వర్క్‌ ఆసుప త్రులను ఎంపిక చేసుకున్న సీనియర్‌ సిటిజన్లు, 45–59 ఏళ్ల వయ స్కులకు రూ. 250 చెల్లింపుపై టీకా వేసేందుకు విస్తృత ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ కావడంతో ఆ మేరకు జిల్లాలో చర్యలు చేపట్టారు. జిల్లాలో దంత వైద్య ఆసుపత్రులు మినహా ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌లో 34 ప్రైవేటు ఆసుపత్రులు ఉండగా, వీటిలో ఏడు ఆసుపత్రుల్లో టీకా పంపిణీకి ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. మిగతా 27 ఆసుపత్రుల్లోనూ వ్యాక్సిన్‌ పంపిణీకి చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. కాగా టీకా పంపిణీని ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకే వేయాలని తొలుత నిర్దేశించినప్పటికీ తాజాగా సవరించారు.సర్వర్‌ సాంకేతిక సమస్యల కారణంగా గంటల తరబడి వేచి ఉండాల్సి రావడం, ఈలోగా నిర్ణీత సమయం ముగియడం, మరుసటి రోజుకి సంబంధిత డేటాను కోవిన్‌ పోర్టల్‌ నుంచి డిలీట్‌ చేస్తుండడం వల్ల నిబంధనలను బుధవారం సవరించారు. లబ్ధ్దిదారుకు కేటాయించిన రోజునే ఎంత ఆలస్యమైనా టీకా వేయాల్సిందేనని ఆదేశాలు జారీ చేశారు. కాగా తొలిదశ పంపిణీలో మొత్తం 27,323 మంది హెల్త్‌ వర్కర్స్‌కు బుధవారం వరకు 20,150 మందికి, రెండో దశ వ్యాక్సిన్‌ పంపిణీలో 41,862 మందికి 25,424 మందికి, తాజాగా ప్రారంభమైన మూడో దశ వ్యాక్సినేషన్‌లో  సీనియర్‌ సిటిజన్లు, 45–59 వయస్కులు మొత్తం 723 మందికి బుధవారం సాయంత్రం వరకు టీకా వేశారు.


అందరూ  వేయించుకోవాలి : కలెక్టర్‌  

ఏలూరు క్రైం, మార్చి 3 : కొవిడ్‌ బారిన పడకుండా సురక్షితంగా ఉండేం దుకు ప్రతిఒక్కరూ వ్యాక్సిన్‌ తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ రేవు ముత్యాల రాజు సూచించారు. బుధవారం ఏలూరు ప్రభుత్వాసు పత్రిలో  కలెక్టర్‌, ఎమ్మెల్సీ రాము సూర్యారావు కొవిడ్‌ టీకా వేయించుకున్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ కొవిడ్‌ వల్ల సుమారు సంవత్సరం పాటు ఎన్నో బాధలు పడ్డామని ప్రస్తుతం వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చిందన్నారు. కొవిడ్‌ వ్యాక్సి న్‌పై కొంతమంది అపోహలు పడుతున్నారని ప్రభుత్వం ఇస్తున్న వ్యాక్సిన్‌ ఎంతో సురక్షితమైనదని చెప్పారు. వ్యాక్సిన్‌ వచ్చినా కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ వచ్చే అవకాశం ఉన్న దృష్ట్యా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు.


అపోహలు వద్దు :మంత్రి రంగనాఽథరాజు

ఆచంట మార్చి 3 : కరోనా వ్యాక్సిన్‌పై ఎటువంటి అపోహ లు వద్దని ప్రతి ఒక్కరు తప్ప నిసరిగా వ్యాక్సిన్‌ వేయించుకోవాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాధరాజు అన్నారు. బుధవారం ఆచంట సామాజిక ఆరోగ్య కేంద్రం వద్ద మంత్రికి స్టాఫ్‌నర్స్‌ టి.జయ వ్యాక్సిన్‌ వేశారు.  మంత్రి మాట్లాడుతూ రానున్న రోజుల్లో అందరికి  వ్యాక్సిన్‌ అందిస్తారన్నారు.



Updated Date - 2021-03-04T05:27:42+05:30 IST