పాక్‌లో అడగుపెట్టిన విండీస్.. ముగ్గురు ఆటగాళ్లకు కరోనా

ABN , First Publish Date - 2021-12-13T01:26:39+05:30 IST

పాకిస్థాన్‌తో మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడేందుకు వెళ్లిన వెస్టిండీస్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. గురువారం

పాక్‌లో అడగుపెట్టిన విండీస్.. ముగ్గురు ఆటగాళ్లకు కరోనా

కరాచీ: పాకిస్థాన్‌తో మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడేందుకు వెళ్లిన వెస్టిండీస్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. గురువారం కరాచీ చేరుకున్న విండీస్ జట్టుకు పరీక్షలు నిర్వహించగా ముగ్గురు ఆటగాళ్లు, సిబ్బందిలో ఒకరికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది.


కరోనా బారినపడిన ఆటగాళ్లలో రోస్టన్ చేజ్, షెల్డన్ కాట్రెల్, కైల్ మేయర్ ఉన్నారు. అలాగే, మరో వ్యక్తికి కూడా కరోనా సోకింది. ఈ విషయాన్ని విండీస్ క్రికెట్ బోర్డు నిర్ధారించింది. వీరందరినీ ప్రత్యేక ఐసోలేషన్ కేంద్రానికి తరలించినట్టు తెలిపింది. అయితే, సిరీస్‌కు వచ్చిన సమస్యేమీ లేదని, మిగతా ఆటగాళ్లందరికీ నెగటివ్ రావడంతో వారు ప్రాక్టీస్ మొదలు పెట్టారని, సిరీస్ యథావిధిగా జరుగుతుందని బోర్డు పేర్కొంది.

 

మూడు టీ20ల్లో భాగంగా తొలి మ్యాచ్ రేపు (13న)  జరుగుతుంది. 14న రెండు, 16న మూడో మ్యాచ్ జరుగుతుంది. ఈ మూడింటికీ కరాచీలోని నేషనల్ స్టేడియం ఆతిథ్యమిస్తోంది. డిసెంబరు 18న తొలి వన్డే జరగనుండగా, 20, 22 తేదీల్లో రెండు, మూడు వన్డేలు జరుగుతాయి. ఇవి కూడా కరాచీ వేదికగానే జరగనున్నాయి.

Updated Date - 2021-12-13T01:26:39+05:30 IST