పాక్‌తో పోరుకు ఇంగ్లండ్ సిద్ధం
ABN , First Publish Date - 2020-08-05T09:14:55+05:30 IST
వెస్టిండీ్‌సపై టెస్ట్ సిరీస్ విజయంతో జోష్ మీదున్న ఇంగ్లండ్ సొంతగడ్డపై మరో చాలెంజ్‌కు సిద్ధమైంది. పాకిస్థాన్‌తో మూడు ...
నేటి నుంచే తొలి టెస్ట్ మ.3.30 నుంచి సోనీ సిక్స్‌లో
మాంచెస్టర్: వెస్టిండీ్‌సపై టెస్ట్ సిరీస్ విజయంతో జోష్ మీదున్న ఇంగ్లండ్ సొంతగడ్డపై మరో చాలెంజ్‌కు సిద్ధమైంది. పాకిస్థాన్‌తో మూడు టెస్ట్‌ల సిరీ్‌సలో భాగంగా బుధవారం నుంచి తొలి టెస్ట్ జరగనుంది. పాక్ నుంచి ఆతిథ్య ఇంగ్లండ్‌కు గట్టిపోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. కెప్టెన్ అజర్ అలీ, బాబర్ ఆజమ్, అసద్ షఫిక్, అబిద్ అలీతో కూడిన పాక్ బ్యాటింగ్ లైనప్ బలంగా కనిపిస్తోంది. బౌలింగ్ విభాగంలో నసీమ్ షా, షహీన్‌షా అఫ్రీది ఇంగ్లిష్ బ్యాట్స్‌మెన్‌ను పరీక్షించే అవకాశం ఉంది.