జయహో

ABN , First Publish Date - 2022-01-27T05:56:08+05:30 IST

73వ గణతంత్ర వేడుకలను బుధవారం వాడవాడలా ఘనంగా నిర్వహించారు.

జయహో
ఏలూరులోని టీడీపీ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ

ఘనంగా గణతంత్ర వేడుకలు
ఏలూరు కార్పొరేషన్‌, జనవరి 26 : 73వ గణతంత్ర వేడుకలను బుధవారం వాడవాడలా ఘనంగా నిర్వహించారు. జనసేన కార్యాలయం వద్ద పార్టీ ఏలూ రు ఇన్‌చార్జ్‌ రెడ్డి అప్పలనాయుడు జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వంద నం స్వీకరించారు. జిల్లా కాంగ్రెస్‌ కార్యాలయం వద్ద  పార్టీ జిల్లా అధ్య క్షుడు జెట్టి గురునాథరావు జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనం స్వీకరించారు. జిల్లా సహకార మార్కెటింగ్‌ సొసైటీ (డీసీఎంఎస్‌) వద్ద డీసీఎం ఎస్‌ చైర్మన్‌ వేండ్ర వేంకట స్వామి జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వంద నం స్వీకరించారు. బ్రాంచ్‌ మేనేజర్‌ కె.నాగమోహన్‌రావు, వివిధ విభాగాల ఇన్‌చార్జ్‌లు సుధాకర్‌, మోహన్‌, కృష్ణమోహన్‌, భాస్కరరావు పాల్గొన్నారు.
పెదపాడు : మండలంలో ఎంపీడీవో కార్యాలయం వద్ద ఎంపీడీవో నిర్మలజ్యోతి జెండాను ఎగురవేశారు. తహసీల్దారు కార్యాలయంలో తహసీల్దారు ఇందిరాగాంధీ, పెదపాడు హైస్కూల్‌లో సొసైటీ అధ్యక్షుడు అక్కినేని రాజశేఖర్‌ ఆధ్వర్యంలో ప్రధానోపాధ్యాయురాలు రోజ్‌లిన్‌ జాతీయ జెండాను ఎగురవేశారు. కొక్కిరపాడు పాఠశాలలో సర్పంచి మరీదు రెడ్డియ్య పాల్గొని విద్యార్థులకు నోట్‌ బుక్స్‌ పంపిణీ చేశారు. వట్లూరులో ఈవో ఎం.శ్రీనివాస్‌ జెండాను ఎగుర వేయగా, వైసీపీ రైతువిభాగం అధ్యక్షుడు ఆళ్ళ సతీష్‌చౌదరి పావురాలను ఎగురవేసి మిఠాయిలు పంచారు. కార్య క్రమాల్లో ఎంపీపీ బత్తుల రత్నకుమారి, సూపరింటెండెంట్‌ విశ్వనాఽథం తదితరులు పాల్గొన్నారు.
ఏలూరు రూరల్‌ : వైసీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నగర అధ్య క్షుడు బొద్దాని శ్రీనివాస్‌ అధ్యక్షతన జరిగిన వేడుకల్లో గాంధేయవాది అడ్డగర్ల రామ్మోహనరావు జెండా ఆవిష్కరించారు. దిరిశాల వరప్రసాద్‌, డిప్యూటి మేయ ర్లు జి.శ్రీనివాస్‌, ఎన్‌.సుధీర్‌ బాబు, విప్‌ పైడి భీమేశ్వరరావు, ఎం.సదానంద కుమార్‌, పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు. ఏలూరు మండల పరిషత్‌ కార్యాలయంలో ఇన్‌చార్జి ఎంపీడీవో ఎన్‌.సరళకుమారి జాతీయ పతాకాన్ని ఆవి ష్కరించి గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.  తహ సీల్దార్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ బి.సోమశేఖర్‌ గాంధీ చిత్రపటానికి నివాళు లర్పించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. వెంకటాపురం పంచాయతీలోని బగ్గయ్య పేట ప్రభుత్వ పాఠశాలలో, మస్తాన్‌ మన్యం కాలనీలో మండల పరి షత్‌ పాఠశాలలో, దొండపాడులోని పరివర్తన్‌ పాఠశాలలో గణతంత్ర వేడుకలు నిర్వహించారు. వాసవీ క్లబ్‌ బి.ఎస్‌.కే.టి. అధ్యక్షుడు మద్దుల కేశవ పాల్గొన్నారు. వైఎన్‌హెచ్‌ఏ ప్రాంగణంలో గణతంత్ర వేడుకలు జరిగాయి. అంబికా రాజా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
ఏలూరు క్రైం : ఏలూరు డీఎస్పీ కార్యాలయంలో ఇన్‌చార్జి డీఎస్పీ అయిన అదనపు ఎస్పీ ఒ.దిలీప్‌కిరణ్‌ జాతీయ జెండా ఎగురవేశారు. ఏలూరు వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ వద్ద వన్‌టౌన్‌ సీఐ బోనం ఆదిప్రసాద్‌, టుటౌన్‌ పోలీస్‌స్టేషన్‌ వద్ద సీఐ డీవీ రమణ, త్రీ టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ వద్ద సీఐ కేవీఎస్‌వీ ప్రసాద్‌, ఏలూరు రూరల్‌ పోలీస్‌ వద్ద సీఐ ఎం.దుర్గాప్రసాద్‌ జాతీయ జెండాలను ఎగురవేశారు. డాక్టరు బీఆర్‌ అంబేడ్కర్‌, గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళుల ర్పించారు. ఏలూరు ప్రభుత్వాస్పత్రి ఆవరణలో జిల్లా ఆస్పత్రుల సేవల సమన్వ య అధికారి డాక్టరు ఏవీఆర్‌ మోహన్‌ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా విధి నిర్వహణలో అత్యంత ప్రతిభ కనబర్చిన సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఆస్పత్రి ఆర్‌ఎంవో శ్రీనివాసరావు, పలువురు వైద్యులు పాల్గొన్నారు. రెడ్‌క్రాస్‌ వద్ద భవనం వద్ద రెడ్‌క్రాస్‌ చైర్మన్‌ బీవీ కృష్ణారెడ్డి జాతీ య జెండాను ఎగురవేసి మహాత్మాగాంధీ, అంబేడ్కర్‌ చిత్రపటాలకు నివాళుల ర్పించారు. కార్యదర్శి బెన్ని, డాక్టరు వరప్రసాద్‌, రెడ్‌క్రాస్‌ ఏఎన్‌ఎం మహిళా కళాశాల ప్రిన్సిపాల్‌ వై.డేబోరా తదితరులు పాల్గొన్నారు.
పెదవేగి : పెదవేగి మండల రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దారు సుంద ర్‌సింగ్‌, పోలీస్‌ స్టేషన్‌లో ఎస్‌ఐ టి.సుధీర్‌, మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీడీవో రాజ్‌మనోజ్‌ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. దుగ్గిరాల సెయింట్‌ జోస్‌ఫ్‌ దంతవైద్య కళాశాలలో వికార్‌ జనరల్‌ ఫాదర్‌ డాక్టర్‌ పి.బాల జాతీయ పతాకాన్ని అవిష్కరించారు. కరస్పాండెంట్‌ ఫాదర్‌ జి.మోజెస్‌, సెయింట్‌ జోసెఫ్‌, నర్సింగ్‌ కళాశాల కరస్పాండెంట్‌ ఫాదర్‌ ఫెలిక్స్‌, ప్రిన్సిపాల్‌ జి.దేవి, ఫాదర్‌ జాకబ్‌, పీడీ ఎన్‌.నల్లయ్య పాల్గొన్నారు. భోగాపురం విజ్ఞాన్‌ గ్లోబల్‌జెన్‌ స్కూల్‌లో పాఠశాల ప్రిన్సిపాల్‌ బిఎన్‌ఎస్‌.మణి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. మేనేజర్‌ అప్పారావు పాల్గొన్నారు. భోగాపురం సమీపంలో జాతీయ రహదారి పక్కన ఏర్పాటు చేసిన 235 అడుగుల భారీ జాతీయ పతాకాన్ని భీమ వరం మునిసిపాలిటీ పారిశుధ్య కార్మికురాలు మాడుగుల లక్ష్మి ఆవిష్కరించింది. బీజేపీ ఏలూరు పార్లమెంట్‌ నియోజకవర్గ కన్వీనర్‌ కట్నేని లక్ష్మీ కృష్ణప్రసాద్‌, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చౌటుపల్లి విక్రమ్‌కిశోర్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచారక్‌ మహేష్‌, కృష్ణ, రాకేష్‌ పాల్గొన్నారు.   
ఏలూరు ఎడ్యుకేషన్‌ : ఏలూరు దక్షిణపు వీధిలోని ఇండోర్‌–ఇంగ్లీష్‌ స్కూల్‌లో జాతీయ పతాకాన్ని కరస్పాం డెంట్‌ అల్లూరి సుభద్రదేవి, సంతోషీనగ ర్‌ శ్రీశర్వాణి విద్యాప్రాంగణంలో స్కూల్‌ డైరెక్టర్‌ కె.మనమోహనరావు, సీఆర్‌ఆర్‌ పబ్లిక్‌ స్కూల్‌ల్లో కరస్పాండెంట్‌ వంకినేని రఘుకుమార్‌, నెల్లూరు రవీంద్ర భారతి స్కూల్‌ల్లో ప్రిన్సిపల్‌ లిల్లీషా, సీఆర్‌ఆర్‌ డిగ్రీ కళాశాలలో కరస్పాండెంట్‌ డాక్టర్‌ విష్ణుమోహన్‌, జిల్లా సైనిక సంక్షేమ అధికారి కేవీఎస్‌ ప్రసాద్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. మాజీ సైనికుల సంక్షేమం కోసం ఎన్‌సీసీ కెడిట్‌లు సేకరించిన నిధిని సాయిరామ్‌ప్రసాద్‌కు అందజేశారు. ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ రామ రాజు, ఎన్‌సీసీ ఆఫీసర్‌ లెఫ్ట్‌నెంట్‌ ఎం.నవీన్‌కుమార్‌ పాల్గొన్నారు. ఏలూరు వంగాయగూడెంలోని యాపిల్‌ సంస్థ కార్యాలయంలో ఆలయన్స్‌ ఇండియా సహకారంతో హెచ్‌ఐవీతో జీవిస్తున్న బాలలకు పౌష్టికాహారాన్ని పంపిణీ చేశా రు. జిల్లాలోని వివిధ మండలాల నుంచి 106 మంది పిల్లలకు, 13 రకాల నిత్యా వసర సరుకులతో కూడిన బ్యాగ్‌లను అదనపు డీఎంహెచ్‌వో డాక్టర్‌ రత్న కుమారి పంపిణీ చేశారు. సంస్థ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ జె.శివకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
ఏలూరు టూటౌన్‌: తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ ఏలూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు జాతీయ జెండాను ఆవి ష్కరించారు. పార్టీ ఏలూరు నియోజకవర్గ కన్వినర్‌ బడేటి రాధాకృష్ణయ్య, కార్యాలయ సమన్వయ కార్యదర్శి పాలి ప్రసాద్‌, రాష్ట్ర కార్యదర్శులు దాసరి ఆంజనేయులు, కొక్కిరిగడ్డ జయరాజు, టి.శివప్రసాద్‌, ఎం.హనుమంతరావు, సీహెచ్‌.వెంకటరత్నం, లంకపల్లి మాణిక్యాలరావు, కె.ఉమామహేశ్వరరావు, బి.బా లాజీ, పి.నిరంజన్‌, వేగి ప్రసాదు, కొల్లేపల్లి రాజు, మెరుసు గంగరాజు పాల్గొ న్నారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో నగర మేయర్‌ షేక్‌ నూర్జహాన్‌ పెద బాబు జాతీయ జెండాను ఆవిష్కరించారు. మహాత్మాగాంధీ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్చించారు. ఎమ్మెల్సీ షేక్‌ బాబ్జీ, నగర కమిషనర్‌ డి.చంద్రశేఖర్‌, డిప్యూటి మేయర్లు జి.శ్రీనివాస్‌, ఎన్‌.సుధీర్‌ బాబు, కోఆప్షన్‌ సభ్యులు పాల్గొన్నారు. బీజేపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు కె.సుధాకర్‌కృష్ణ, సీపీఐ జిల్లా కార్యాలయంలో జిల్లా కార్యదర్శి డేగా ప్రభాకర్‌, బాలల గ్రంఽథా లయంలో గ్రంఽథ పాలకురాలు ఎం.శోభ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఎ.వి.ఆర్‌ విజ్ఞానకేంద్రం, ఎస్సీ, ఎస్టీ బహుజన సొసైటీ ఆధ్వర్యంలో, బహుజన సొసైటీ, మానవత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో, దళితసేన కార్యాలయంలో ఏపీ రాష్ట్ర దళితసేన వ్యవస్థాపక అధ్యక్షుడు జుజ్జువరపు రవిప్రకాష్‌ ఆధ్వర్యంలో  వేడుకలను నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్‌ మోనటరింగ్‌ కమిటీ సభ్యుడు ఎం.అజయ్‌బాబు, ఏవీఆర్‌ విజ్ఞాన కేంద్రం జిల్లా కార్యదర్శి వి.నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-27T05:56:08+05:30 IST