వైభవంగా ముగిసిన శరన్నవరాత్రులు

ABN , First Publish Date - 2021-10-17T04:47:55+05:30 IST

ఏలూరు నగరంలోని పలు డివిజన్లలో గల అమ్మవారి ఆలయాల వద్ద ఈనెల 7వ తేదీన ప్రారంభమైన శ్రీదేవీ శరన్న వరాత్రులు 15వ తేదీ శుక్రవారం రాత్రితో ముగిశాయి.

వైభవంగా ముగిసిన శరన్నవరాత్రులు
రాజరాజేశ్వరి అలంకరణల పత్తేబాద నాలుగు గుళ్లు సెంటర్‌లోని అమ్మవారు

ఏలూరు కార్పొరేషన్‌, అక్టోబరు 16 : ఏలూరు నగరంలోని పలు డివిజన్లలో గల అమ్మవారి ఆలయాల వద్ద ఈనెల 7వ తేదీన ప్రారంభమైన శ్రీదేవీ శరన్న వరాత్రులు 15వ తేదీ శుక్రవారం రాత్రితో ముగిశాయి. అమ్మవారు విజ య దశమి పర్వదినం సందర్భంగా రాజరాజేశ్వరిదేవిగా భక్తులకు దర్శనమిచ్చా రు. ఉత్సవమూర్తిని మేళ తాళాలతో ఊరేగింపులు జరిపి నిమజ్జన కార్యక్రమాలు నిర్వహించారు. రాత్రివేళల్లో జమ్మిచెట్టు వద్ద పూజలు జరిపారు. దక్షిణపువీధి లోని కోదండ రామాలయం వద్ద దసరా దశావతారాల్లో భాగంగా సీతారాములు విజయదశమి పర్వదినం నాడు రామావతారంలో దర్శనమిచ్చారు. రామ కృష్ణా పురంలోని సత్యసాయి జిల్లా సేవా కేంద్రం వద్ద విజయదశమి పర్వదినం సంద ర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జమ్మిచెట్టు వద్ద విశేష పూ జలు జరిపారు. సత్యసాయి సేవా సంస్థల జిల్లా అధ్యక్షుడు కానుమిల్లి శశిశేఖర రావు, మిత్ర బృందం భక్తులకు ఏర్పాట్లు చేశారు.

దెందులూరు : దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గోపన్నపాలెంలోని కనకదుర్గ ఆలయంలో ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి, వైసీపీ మండల కన్వీ నర్‌ కామిరెడ్డి వెంకట నరసింహరావు (నాని) ప్రత్యేక పూజలు నిర్వహిం చారు.  అమ్మవారిని రకరకాల పూలతో అలంకరించి, ప్రత్యేక పూజలు, కుంకుమ పూజ లు సర్పంచ్‌ కోటి నాగ మల్లేశ్వరి కుమార్‌, ఎంపీటీసీ ఏనుగు అంజలి ప్రసాద్‌ దంపతులతో కలిసి ఎమ్మెల్యే సామూహిక కుంకుమ, పూజలు చేశారు. ఆలయ కమిటీ సభ్యుడు తోట పద్మారావు, మాజీ సర్పంచ్‌ హనుమంతు ఉన్నారు.

పెదపాడు : దసరా శరన్నవరాత్రులను పురస్కరించుకుని పూజలం దుకు న్న అమ్మవారి గ్రామోత్సవాలు శనివారం ఘనంగా జరిగాయి. పెదపాడులోని తెలగాలపేట, బస్టాండ్‌ సెంటర్‌లో రామాలయం వద్ద ఏర్పాటు చేసిన కనక దుర్గమ్మ ఊరేగింపు తీన్‌మార్‌ డప్పు వాయిద్యాల నడుమ ఘనంగా నిర్వ హిం చగా, భక్తులు అమ్మవార్లను దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు.

పెదవేగి : నవరాత్రి వేడుకలు చివరిరోజు విజయదశమి రోజున శుక్రవారం రాత్రి పలు దేవాలయాల్లో భక్తులు శమీ వృక్షపూజ చేసి, తమ కోర్కెలను నివేదించారు. రాట్నాలకుంట  రాట్నాలమ్మ ఆలయంలో ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి, ఏపీ ఆయిల్‌ఫెడ్‌ రైతుకమిటీ చైర్మన్‌ కొఠారు రామచంద్రరావు, రాణి దంపతులు  శమీవృక్షపూజలో పాల్గొన్నారు. ఆలయ అర్చకుడు పావులూరి వీరవెంకట రమాసత్యనారాయణ శర్మ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు.  పెదవేగి శివాలయం, రాట్నాలకుంట సాయిబాబా ఆలయంలో శమీవృక్షపూజ భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.


 జిల్లా పోలీస్‌ కార్యాలయం వద్ద ఆయుధ,వాహన పూజ 

ఏలూరు క్రైం, అక్టోబరు 16 : విజయదశమి  ప్రతి ఒక్కరికి సంతోషాన్ని, విజయాన్ని కలుగజేయా లని, ప్రజ లందరూ పాడిపంటలతో సు భిక్షం గా ఉండాలని జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ అన్నారు. విజయదశమి (దసరా) సందర్భంగా శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయం వద్ద ఆయుధపూజ, వాహన పూజ నిర్వహిం చారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ పాల్గొన్నారు. పోలీస్‌ పెరేడ్‌ గ్రౌండ్‌లో స్పెషల్‌ పార్టీ సిబ్బందికి నూతనంగా నిర్మించిన వసతి గృహాన్ని ఎస్పీ ప్రారంభించారు. పోలీస్‌ కో ఆపరేటివ్‌ పెట్రోల్‌ బంకులో నూతనంగా నిర్మించిన వాహనాలకు గ్యాస్‌, నైట్రోజన్‌ గ్యాస్‌ను ఉచితంగా సరఫరా చేయడానికి ఏర్పాటు చేసిన పంపులను ఎస్పీ ప్రారంభించారు. అదనపు ఎస్పీ ఏవీ సుబ్బరాజు, ఎస్‌ఈబీ అదనపు ఎస్పీ సి.జయరామరాజు, ఏలూ రు డీఎస్పీ డాక్టర్‌ ఒ.దిలీప్‌ కిరణ్‌, డీటీసీ డీఎస్పీ కె.ప్రభాకరరావు తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2021-10-17T04:47:55+05:30 IST