సేంద్రియ సాగుతో ఆరోగ్య సంరక్షణ

ABN , First Publish Date - 2021-10-17T05:08:33+05:30 IST

ఆరోగ్య సంరక్షణ, భూసార పరిరక్షణకు సేంద్రియ సాగు ఎంతో ఉత్తమమైనదని కేరళ వ్యవసాయశాఖ మంత్రి ప్రసాద్‌ అన్నారు.

సేంద్రియ సాగుతో ఆరోగ్య సంరక్షణ
కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా, దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరితో కేరళ వ్యవసాయశాఖ మంత్రి ప్రసాద్‌

  కేరళ వ్యవసాయశాఖ మంత్రి ప్రసాద్‌

పెదవేగి, అక్టోబరు 16 : ఆరోగ్య సంరక్షణ, భూసార పరిరక్షణకు సేంద్రియ సాగు ఎంతో ఉత్తమమైనదని కేరళ వ్యవసాయశాఖ మంత్రి ప్రసాద్‌ అన్నారు. అమ్మపాలెం, ముండూరు, లక్ష్మీపురం గ్రామాల్లో జరుగుతున్న సేంద్రియ, ప్రకృతి సాగును కేరళ వ్యవసాయశాఖ మంత్రి ప్రసాద్‌ ఆధ్వర్యంలో కేరళ బృందం శనివారం పరిశీ లించింది. అమ్మపాలెంలో రైతు సాయిబాబు ప్రకృతి విధానంలో సాగుచేస్తున్న వరిపంట, ముండూరులో నందిగం ప్రసాద్‌ సేంద్రియ వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించారు. లక్ష్మీపురంలో రైతు దావులూరి విజయసారథికి చెందిన 40 ఎకరాల వ్యవసాయ క్షేత్రాన్ని కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా, దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరిలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా పంటసాగులో అవలంభిస్తున్న మెలకువలు, సాగు విధానాన్ని కేరళ బృందం రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కేరళ వ్యవసాయశాఖ మం త్రి ప్రసాద్‌ మాట్లాడుతూ ప్రకృతి విధానంలో జరుగుతున్న సాగుతో అన్నివిధా ల లాభదాయకమన్నారు. జేసీ అంబేడ్కర్‌, దెందులూరు ఏఎంసీ చైర్మన్‌ మేకా లక్ష్మణరావు, వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-17T05:08:33+05:30 IST