Abn logo
Oct 21 2021 @ 22:57PM

లాసెట్‌లో భరత్‌కు రాష్ట్ర స్థాయి ర్యాంకు

ఏలూరు రూరల్‌, అక్టోబరు 21: ఏలూరుకు చెందిన పీఎస్‌ఎల్‌ భరత్‌కు గురువారం ప్రకటించిన లాసెట్‌ ఫలితాల్లో ఎల్‌ఎల్‌బీ మూడో సంవత్సరంలో రాష్ట్ర స్థాయి లో 24వ  ర్యాంకు సాధించాడు. సీఏ ఫైనల్‌ ఈయర్‌ చదువుతున్న భరత్‌ది ఉంగుటూరు మండలం గొల్ల గూడెం. తండ్రి వ్యవసాయ పనులు చేస్తూ కుమారు డిని చదివిస్తున్నారు. భరత్‌ ఏలూరు రూరల్‌ మండలం శనివారపుపేటలో ఒక రూమ్‌ తీసుకుని అద్దెకు ఉంటూ ఎల్‌ఎల్‌బీ చదువుతున్నాడు. లాసెట్‌ ఫలితాల్లో 24వ ర్యాంకు సాధించడం పట్ల పలువురు హర్షం ప్రకటించారు.