నాలుగు మండలాల్లో 18 కరోనా కేసులు

ABN , First Publish Date - 2021-06-18T04:39:31+05:30 IST

గ్రామాల్లో కరోనా మహమ్మారి క్రమేపీ తగ్గుముఖం పడుతోంది.

నాలుగు మండలాల్లో 18 కరోనా కేసులు
సత్రంపాడులో ప్రత్యేక పారిశుధ్య పనులు


ఏలూరు రూరల్‌/దెందులూరు/పెదవేగి/పెదపాడు, జూన్‌ 17: గ్రామాల్లో కరోనా మహమ్మారి క్రమేపీ తగ్గుముఖం పడుతోంది. ఏలూరు మండల వ్యాప్తంగా సుమారు నెలన్నర తర్వాత  అతి స్వల్పంగా కేసులు నమోదయ్యాయి. గురువారం కేవలం ఒకటే కేసు నమోదయినట్టు ఇన్‌ఛార్జి ఎంపీడీవో సరళకుమారి తెలిపారు. కేసులు నమోదైన ప్రాంతాల్లో పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టారు. దెందులూరు మండలం పోతునూరు, గాలాయగూడెం, గోపన్నపాలెంలో ఒక్కొక్కటి చొప్పున మొత్తం 3 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్టు తహసీల్దార్‌ నాంచారయ్య, ఎంపీడీవో లక్ష్మీ తెలిపారు. పెదవేగి మండలంలో గురువారం పది కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని పెదవేగి ప్రాఽథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్‌ టీవీఎల్‌.ప్రసన్నకుమార్‌ చెప్పారు. ఇప్పటివరకు మండలంలో 1171 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని, హోం ఐసోలేషన్‌లో 920 మంది చికిత్స పూర్తిచేసుకున్నారని, ప్రస్తుతం 151 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారని, 80 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని వివరించారు.  20 మంది మృతి చెందగా నలుగురు ఇంటివద్ద, 16మంది ఆస్పత్రిలో మృతి చెందారన్నారు. పెదపాడు మం డలంలోని వట్లూరు పీహెచ్‌సీ పరిధిలో వట్లూరు, కొక్కిరపాడు, దాసరిగూడెం, కలపర్రులలో ఒక్కొక్కటి చొప్పున నాలుగు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.  

Updated Date - 2021-06-18T04:39:31+05:30 IST