28 కరోనా కేసులు నమోదు

ABN , First Publish Date - 2021-06-24T04:54:23+05:30 IST

గ్రామాల్లో కొవిడ్‌ మహమ్మారి తగ్గుముఖం పడుతోంది.

28 కరోనా కేసులు నమోదు
శనివారపుపేటలో డ్రెయినేజీ శుభ్రం చేస్తున్న పారిశుధ్య కార్మికుడు

ఏలూరు రూరల్‌/ పెదపాడు/పెదవేగి/ దెందులూరు, జూన్‌ 23: గ్రామాల్లో కొవిడ్‌ మహమ్మారి తగ్గుముఖం పడుతోంది. తాజాగా బుధవారం ఏలూరు మండలంలో ఆరు కేసులు నమోదయ్యాయి. టెస్టింగ్‌, ట్రేసింగ్‌ చేపట్టి కొవిడ్‌ టెస్టులు నిర్వహిస్తున్నారు. ఆయా పంచాయతీల్లో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమా లు చేపట్టి బ్లీచింగ్‌, సోడియం హైపోక్లోరైడ్‌ పిచికారీ చేయించి డ్రెయిన్లలో సిల్టు తొలగింపు కార్యక్రమం ముమ్మరం చేశారు. పెదపాడు మండలంలో వట్లూరు పీహెచ్‌సీ పరిధిలో ఏపూరు, వట్లూరులో ఒక్కొక్కటి చొప్పన పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. పెదపాడు పీహెచ్‌సీ పరిధిలో కొత్తముప్పర్రు, నాయుడు గూడెం, గుడిపాడు గ్రామాల్లో ఒక్కొక్కటి చొప్పున, పెదపాడులో రెండు పాజి టివ్‌ కేసులు నమోదైనట్టు డాక్టర్లు పూజ, భారతిలు తెలిపారు. పెదవేగి మండలంలో బుధవారం 15 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని పెదవేగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్‌ టీవీఎల్‌.ప్రసన్నకుమార్‌ చెప్పారు. ఇప్పటివరకు మండలంలో 1250 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని, వారిలో హోం ఐసోలేషన్‌లో 988 మంది ఉండి చికిత్స పూర్తిచేసుకున్నారన్నారు. ప్రస్తు తం 157 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారని, 85 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారన్నారు. దెందులూరు మండలంలో బుధవారం కేసులు నమోదు కాలేదు.  

Updated Date - 2021-06-24T04:54:23+05:30 IST