ఏలూరు రూరల్‌ మండలంలో 52

ABN , First Publish Date - 2022-01-24T04:13:05+05:30 IST

గ్రామాల్లో కొవిడ్‌ కేసులు విజృంభిస్తున్నాయి.

ఏలూరు రూరల్‌ మండలంలో 52
గుడివాకలంకలో పారిశుధ్య పనులు నిర్వహిస్తున్న కార్మికులు

ఒకరోజులో నమోదైన కేసులు..చుట్టేస్తున్న కరోనా
ఏలూరురూరల్‌, జనవరి 23 : గ్రామాల్లో కొవిడ్‌ కేసులు విజృంభిస్తున్నాయి. రోజురోజుకి కేసులు పెరుగుతుండడంతో వైద్యాధికారులు ఆందోళన చెందుతు న్నారు. తాజాగా ఏలూరు మండలంలో ఆదివారం 52 కేసులు నమోదైనట్టు మండల వైద్యాధికారి డాక్టర్‌ దేవ్‌మనోహర్‌ కిరణ్‌ తెలిపారు. కొవిడ్‌ కేసులు పెరుగుతుండడంతో యంత్రాంగం కొవిడ్‌ నియంత్రణపై దృష్టి సారించారు. కొవిడ్‌ ప్రబలిన ప్రాంతాల్లో ప్రత్యేక పారిశుధ్య పనులు చేపట్టారు. బ్లీచింగ్‌ చల్లి రసాయనాలను పిచికారీ చేశారు. ఇదిలా ఉండగా ఇతర దేశాల నుంచి వస్తున్న ప్రయాణికుల గురించి ఆరా తీస్తున్నారు. రెండు డోసులు వ్యాక్సిన్‌ తప్పనిసరిగా తీసుకోవాలని, రెండు డోసులు పూర్తయిన వారు తొమ్మిది నెలలు తర్వాత బూస్టర్‌ డోసు తీసుకోవాలని సూచిస్తున్నారు. నేటికీ ఈ గ్రామాల్లో కొందరు వ్యాక్సినేషన్‌కు భయపడుతూ వెనక్కి తగ్గుతున్నారు. ఇటువంటి వారిని గుర్తించే పనిలో వైద్య సిబ్బంది నిమగ్నమయ్యారు. కొవిడ్‌ మూడో విడత కొత్త వేరి యంట్‌ ఒమైక్రాన్‌ రూపంలో విస్తరిస్తున్నట్టు వార్తలు రావడంతో వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ప్రత్యేక ఫీవర్‌ సర్వే నిర్వహిస్తున్నారు.  

 పెదపాడు మండలంలో 15
పెదపాడు 1 : పెదపాడు మండలంలో ఆదివారం 15 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వట్లూరు పీహెచ్‌సీ పరిధిలో వట్లూరులో నాలుగు, పెదపాడు పీహెచ్‌సీ పరిధిలో కొత్తముప్పర్రు, పాతముప్పర్రు, వసంతవాడ గ్రామాల్లో రెండేసి, నాయుడుగూడెం, సత్యవోలు, గుడిపాడు, సకలకొత్తపల్లి, పెదపాడు గ్రామాల్లో ఒక్కొక్కటి చొప్పున  కేసులు నమోదైనట్టు వైద్యసిబ్బంది తెలిపారు.

Updated Date - 2022-01-24T04:13:05+05:30 IST