Abn logo
Oct 25 2021 @ 23:55PM

కదం తొక్కిన విద్యార్థులు

ఏలూరులో ర్యాలీ చేస్తున్న విద్యార్థులు

ఏలూరు కలెక్టరేట్‌, అక్టోబరు 25 : 70 ఏళ్ళుగా పేద, బడుగు, బలహీన వర్గాలకు విద్యనందిస్తున్న ఏలూరు కేపీడీటీ ఎయిడెడ్‌ హైస్కూలు, పీడీబీటీ ఎయిడెడ్‌ జూనియర్‌ కళాశాలలను ప్రభుత్వంలో విలీనం చేయాలని టీచర్స్‌ ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ డిమాండ్‌ చేశారు. విద్యార్థులు, పూర్వ విద్యార్థులు పీడీ ఎస్‌యూ ఆధ్వర్యంలో పాఠశాల నుంచి ర్యాలీగా బయలుదేరి కలెక్టరేట్‌ వద్దకు చేరుకుని ధర్నా నిర్వహించారు. సాబ్జీ మాట్లాడుతూ అశోక్‌నగర్‌ సొసైటీ అప్పట్లో రెండున్నర ఎకరాల స్థలం ఇవ్వగా ఎందరో దాతల సహకారంతో భవనాలు నిర్మించారని 76 ఏళ్ల పాటు విద్యనందించిన పాఠశాలను మూసివేయడం దారు ణమన్నారు. దీనివల్ల పేద విద్యార్థులు చదువుకు దూరమవుతారన్నారు. వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకోవాలన్నారు. పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు కాకి నాని, మస్తాన్‌, గణేష్‌, పాండు రంగారావు, అహ్మద్‌, చెలికాని వెంకటేష్‌, దుర్గా ప్రసాద్‌, శివ తదితరులు పాల్గొన్నారు.