పెండింగ్‌ బిల్లులు చెల్లించండి

ABN , First Publish Date - 2021-09-18T05:18:45+05:30 IST

మధ్యాహ్నభోజన పథకం వంట చార్జీ లకు సంబంధించి పెండింగ్‌ బిల్లులు, కార్మికులకు వేతన బకాయిలు తక్షణమే చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ సీఐటీయూ అనుబంధ సంస్థ ఏపీ మధ్యాహ్న భోజన కార్మికుల యూనియన్‌ ఆధ్వర్యంలో శుక్రవారం డీఈవో కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు.

పెండింగ్‌ బిల్లులు చెల్లించండి
డీఈవోకు వినతి పత్రం అందజేస్తున్న మధ్యాహ్న భోజన పథకం కార్మికులు

ఏలూరు ఎడ్యుకేషన్‌, సెప్టెంబరు 17 : మధ్యాహ్నభోజన పథకం వంట చార్జీ లకు సంబంధించి పెండింగ్‌ బిల్లులు, కార్మికులకు వేతన బకాయిలు తక్షణమే చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ సీఐటీయూ అనుబంధ సంస్థ ఏపీ మధ్యాహ్న భోజన కార్మికుల యూనియన్‌ ఆధ్వర్యంలో శుక్రవారం డీఈవో కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. సంఘ రాష్ట్ర కార్యదర్శి రమాదేవి మాట్లాడుతూ భోజన పథకం కార్మికులకు ఎనిమిది నెలలుగా వంట చార్జీల బిల్లులు చెల్లించక పోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆరోపించారు. సీఐటీయూ ప్రధాన కార్యదర్శి ప్రసాద్‌ మాట్లాడుతూ మధ్యాహ్న భోజన పథకంలో పని చేస్తున్న కార్మికులకు ఉపాధి భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని డీఈవో  రేణుకకు అందజేశారు. ధర్నాలో సంఘ నాయకులు సి.హెచ్‌.బేబి, శ్యామల రాణి, విజయలక్ష్మి, నాగమణి, రంగ మ్మ, ఝాన్సీ, నాగరత్నం, గంగ పాల్గొన్నారు కాగా మధ్యాహ్నభోజన పథకానికి సంబంధించి గత ఆర్థిక సంవత్సరం (2020–21) జిల్లాలో మొత్తం రూ. 6 కోట్ల 13 లక్షల 70 వేల 734లు చెల్లించాల్సి ఉందని జిల్లా విద్యాశాఖ వర్గాలు వెల్లడిం చాయి. ఈ బకాయిల చెల్లింపునకు సంబంధించిన ఫైలు గత మూడు నెలలుగా రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వద్ద పెండింగ్‌లో ఉందని వివరించాయి. 


 బకాయి జీతాలు చెల్లించాలి 

ఏలూరు కలెక్టరేట్‌, సెప్టెంబరు 17: కొవిడ్‌ వారియర్స్‌ (కొవిడ్‌ కాంట్రాక్టు స్టాఫ్‌)కు ఐదు నెలల బకాయి జీతాలు చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించా లని కోరుతూ శుక్రవారం కలెక్టరేట్‌ వద్ద కొవిడ్‌ కాంట్రాక్టు సిబ్బంది ధర్నా నిర్వహించారు. ధర్నానుద్దేశించి సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డీఎన్‌వీడీ ప్రసాద్‌ మాట్లాడుతూ కొవిడ్‌ కష్టకాలంలో ప్రాణాలకు తెగించి పనిచేసిన కొవిడ్‌ సిబ్బందికి ఐదు నెలలుగా జీతాలు చెల్లించక పోవడం అన్యాయమన్నారు. ప్రభు త్వం చేపడుతున్న రెగ్యులర్‌ నియామకాల్లో కొవిడ్‌ స్టాఫ్‌కు ప్రాధాన్యం ఇవ్వా లని, బకాయి జీతాలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. జిల్లా అధ్యక్షుడు సోమ య్య పాల్గొని సంఘీభావం తెలిపారు. అనంతరం కలెక్టర్‌కు వినతి పత్రం అందించారు. పి.అనిల్‌రాజు, వినోద్‌కుమార్‌, ప్రవీణ్‌ కుమార్‌, రమణ, సురేష్‌, భవానీ, శుభగీత, సింధు, భవానీ, భద్రావతి తదితరులు పాల్గొన్నారు. 

 

ఉపాధి హామీ బకాయిలు చెల్లించాలి 

ఏలూరు కలెక్టరేట్‌, సెప్టెంబరు 17 : ఉపాధి కూలీలకు చెల్లించాల్సిన బకాయి లను తక్షణమే చెల్లించాలని ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. శుక్రవా రం డ్వామా పర్యవేక్షకులకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏప్రిల్‌ నుంచి నేటి వరకూ ఉపాధి హామీ పనులకు సంబంధించి బకాయిలు చెల్లించలేదన్నారు. జిల్లా కార్యదర్శి కె.లక్ష్మణరావు, పి.పెంటయ్య, బి.ప్రభాకర్‌ తది తరులు పాల్గొన్నారు. 

  పెండింగ్‌లో ఉన్న ఉపాధి హామీ కూలీల వేతన బకాయిలు విడుదల చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఎ.రవి డిమాండ్‌ చేశారు. శుక్రవారం డ్వామా పీడీ పి.రాంబాబును కలిసి వినతిపత్రం అందజేశా రు. జిల్లా అధ్యక్షుడు పి.రామకృష్ణ పాల్గొన్నారు.  

Updated Date - 2021-09-18T05:18:45+05:30 IST