బ్లాక్‌..భయం

ABN , First Publish Date - 2021-05-18T05:42:49+05:30 IST

కరోనా వైరస్‌ మొద టి దశ గండం నుంచి బయటపడ్డామని ఊపిరి పీల్చుకుం టున్న తరుణంలో బ్లాక్‌ ఫంగస్‌ వెంటాడుతోంది.

బ్లాక్‌..భయం

కరోనా నుంచి కోలుకున్నా వెంటాడుతున్న వైరస్‌.. జిల్లాలో ఇద్దరు అనుమానితులు  

ఏలూరు క్రైం/ఎడ్యుకేషన్‌, మే 17: కరోనా వైరస్‌ మొద టి దశ గండం నుంచి బయటపడ్డామని ఊపిరి పీల్చుకుం టున్న తరుణంలో రెండో దశ మరింత భయపెడుతోంది. ఆసుపత్రిలో చేరి కరోనా ముప్పు నుంచి బయటపడ్డామ నుకుంటే బ్లాక్‌ ఫంగస్‌ వెంటాడుతోంది. జిల్లాలో ఇద్దరికి ప్రాథమికంగా బ్లాక్‌ ఫంగస్‌ సోకినట్లు అనుమానిస్తున్నారు. నిడదవోలు, పెదపాడు మండలంలో బాధితులు ఉన్నట్లు సమాచారం. బ్లాక్‌ ఫంగస్‌ ఒకరి నుంచి ఒకరికి సోకే అవ కాశం లేదు. ఆక్సిజన్‌ మాస్క్‌లు, సిలైన్‌ బాటిల్స్‌లోని వాట ర్‌, వివిధ రకాల స్టెరాయిడ్‌ ఇంజక్షన్ల ద్వారా వ్యాధి వచ్చే అవకాశం ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. బాధితులకు ఇచ్చే స్టెరాయిడ్స్‌ వల్ల బ్లాక్‌ ఫంగస్‌ సోకే అవకాశం ఉంది. కొవిడ్‌తో ఊపిరి ఆడక సమస్యలు ఎదుర్కొంటున్న బాధితు లకు శ్వాస అందించే ఆక్సిజన్‌ మాస్క్‌లను స్టెరిలైజ్‌ లేదా శానిటైజ్‌ చేయకుండా అమర్చుతుండడం బ్లాక్‌ ఫంగస్‌కు ఒక కారణమని వైద్య ఆరోగ్య శాఖ ఎపిడిమియాలజి విభా గం గుర్తించింది. మెడికల్‌ ఆక్సిజన్‌ మాస్క్‌లను సరైన పద్ధ తిలో శానిటైజ్‌ చేయాల్సిన ఆవశ్యకత ఉందని వైరస్‌ సం బంధిత జబ్బుల విభాగం వైద్యాధికారులు తేల్చిచెప్పారు. కొందరు కరోనా బాధితులు కోలుకున్న తరువాత బ్లాక్‌ ఫంగస్‌ బారిన పడడానికి అప్పటికే ఉన్న దీర్ఘకాలిక వ్యాధు లు  కారణం కావచ్చు. యాంటీ ఫంగల్‌ కంటి చుక్కల మందుతోపాటు, సరైన చికిత్స పొందితే బ్లాక్‌ ఫంగస్‌ నుంచి బయటపడవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.

కాళ్లలో మరో కేసు

ఏలూరు రూరల్‌/నిడదవోలు, మే 17: ఇప్పటికే జిల్లాలో నిడదవోలు, పెదపాడు బ్లాక్‌ ఫంగస్‌ అనుమా నిత కేసులు వెలుగులోకి రాగా సోమవారం కాళ్ల మండ లం ఎల్‌ఎన్‌ పురానికి చెందిన సూర్యనారాయణకు సోకి నట్టు గుర్తించారు. ఆయనకు విజయవాడ మణిపాల్‌ ఆస్పత్రిలో పరీక్షలు చేసిన వైద్యులు బ్లాక్‌ ఫంగస్‌గా తేల్చారు. ఐదు రోజులకు మందులు ఇచ్చి హోం ఐసో లేషన్‌లో ఉండాలని సూచించారు. స్థానిక పీహెచ్‌సీ డాక్టర్‌ గులాబ్‌రాజ్‌ కుమార్‌, సిబ్బంది సూర్యనారాయణ ఇంటికి వెళ్లి వివరాలు సేకరించారు. దీనిపై డిప్యూటీ ఆళ్ల నాని స్పందిస్తూ జిల్లాలో వ్యాధి ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని డీఎంహెచ్‌వో డాక్టర్‌ సునంద ను ఆదేశించారు. నిడదవోలుకు చెందిన కోలపల్లి అంజి బాబు కన్ను వాపునకు గురై బ్లాక్‌ ఫంగస్‌ అనే లక్షణా లున్నాయని అధికారులు భావించారు. మెరుగైన వైద్యం కోసం వైద్య ఆరోగ్య శాఖాధికారులు సోమవారం విజయవాడ తరలించారు.  

ఆక్సిజన్‌ మాస్క్‌లపై దృష్టి

మధుమేహం వున్న వారికి రోగ నిరోధక శక్తి తక్కువ. వారు కొవిడ్‌ బారిన పడితే స్టెరాయిడ్‌ వల్ల బ్లాక్‌ ఫంగస్‌ వచ్చే అవకాశం ఉంది. ఆక్సిజన్‌ మాస్క్‌, సిలైన్‌ బాటిల్స్‌ వ ల్ల సోకుతుంది. నిడదవోలులో ఇలాంటి కేసు ఒకటి నమో దైంది. బ్లాక్‌ ఫంగస్‌ సోకితే మొదట కన్ను ప్రభావితం అవుతుంది. కంటిచూపు పూర్తిగా కోల్పోయే ప్రమాదం ఉం ది. ఈ వ్యాధి సోకకుండా ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకో వాలో జిల్లాలో అన్ని ఆసుపత్రుల సిబ్బందికి అవగాహన కల్పించాం. తరచూ ఆక్సిజన్‌ మాస్క్‌లను శుభ్రం చేయిస్తు న్నాం. మధుమేహ బాధితులకు సూచనలు ఇస్తున్నాం. 

 – డాక్టర్‌ ఏవీఆర్‌ మోహన్‌, డీసీహెచ్‌ఎస్‌, ఏలూరు

నిర్లక్ష్యం చేయొద్దు

కరోనా బాధితులకు చికిత్సలో భాగంగా స్టెరాయిడ్స్‌ అందిస్తారు. కరోనా బాధితులకు వాడే ఆక్సిజన్‌ మాస్క్‌ లను ఎప్పటికప్పుడు శుభ్రపర్చుకోవాలి. బ్లాక్‌ ఫంగస్‌ వల్ల కంటి భాగంలో వాపు రావడం, తొలుత నొప్పి తెలియక పో వడం, తరువాత నొప్పి రావడం, ముక్కు నుంచి నలుపు రంగు చీము కారడం వంటి లక్షణాలు ఉంటాయి. కంటి చూపు మందగించడం, క్రమేపీ ఇది కంటి భాగంలో సోకి కన్ను పాడైపోతుంది. తరువాత మెదడుకు సోకి మెదడు వాపు వచ్చి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. ప్రాథమి క దశలో గుర్తించి కంటి వైద్యులకు చూపించాలి. ఈ వ్యాధి  ఒకరి నుంచి మరొకరికి సోకే  ప్రమాదం లేదు. ప్రతి ఒక్కరు మాస్క్‌ ధరించి, శానిటైజర్‌ వినియోగించుకోవాలి. భౌతిక దూరం పాటించాలి.

– డాక్టర్‌ పోతుమూడి శ్రీనివాసరావు, చీఫ్‌ ఫిజీషియన్‌, జిల్లా ఆసుపత్రి, ఏలూరు


Updated Date - 2021-05-18T05:42:49+05:30 IST