సాగునీరు అందేనా..?

ABN , First Publish Date - 2021-06-22T05:12:00+05:30 IST

ఏలూరు మండలంలోని వరి పొలాలకు సాగు నీరు అందించే పంట కాల్వల్లో పూడికలు తీయకపోవడంతో శివారు పొలాలకు సాగునీరు అందే అవకాశాలు కనిపించడం లేదు.

సాగునీరు అందేనా..?
సుంకరవారితోట డ్రెయిన్‌ దుస్థితి


గుర్రపుడెక్క, చెత్తా చెదారాలతో పంట కాల్వలు

ప్రక్షాళన మరిచిన అధికారులు, పాలకులు

శివారు ఆయకట్టుకు సాగునీరు కష్టమే..

ఆందోళన వ్యక్తం చేస్తున్న  రైతులు


ఏలూరు రూరల్‌, జూన్‌ 21 : ఏలూరు మండలంలోని వరి పొలాలకు సాగు నీరు అందించే పంట కాల్వల్లో పూడికలు తీయకపోవడంతో శివారు పొలాలకు సాగునీరు అందే అవకాశాలు కనిపించడం లేదు. సుదీర్ఘంగా జాలిపూడి పంట కాల్వ, పోణంగి పుంత కాల్వ, పెదపాడు నుంచి ఏలూరు వచ్చే డ్రెయిన్‌ చెత్తా చెదారాలు, గుర్రపుడెక్క, తూడుతో నిండి ఉన్నాయి. ఈ అవరోధాలు తొలగించ కుండా పొలాలకు సాగు నీరు ఎలా అందుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మండలంలోని 16 వేల హెక్టార్లలో ఖరీఫ్‌ సాగు కోసం రైతులు దుక్కులు ప్రారంభించారు. పోణంగి పుంత కాల్వ పరిధిలో 9 వేల హెక్టార్లు, కృష్ణా కెనాల్‌ పరిధిలో మూడు వేల హెక్టార్లలో సాగవుతుంది. మిగ తా నాలుగు వేల హెక్టా ర్లు బోర్ల కింద సాగవుతుంది. పంట కాల్వల ద్వారా సుమారు 15 కిలోమీటర్లు పొడవు ఉన్న జాలిపూడి డ్రెయిన్‌, పోణంగి పుంత కాల్వల్లో చెత్తాచెదారంతో పాటు గుర్రపుడెక్క, తొలగించకపోవడంతో సాగునీరు అందేది ప్రశ్నార్థకంగా మారింది. వర్షాలు కురిస్తే వర్షపునీరు కిందికి వెళ్లే మార్గం లేక పొలాలు ముంపు బెడదను ఎదుర్కొవాల్సి వస్తుందని రైతులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా కాల్వల్లో పూడిక తీసి వేత పనులు చేపట్టాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. 


నీటి సమస్యతో నారుమళ్లు ఆలస్యం

డి.లక్ష్మణరావు, రైతు వెంకటాపురం

గ్రామాల్లో ఆయకట్టు పొలాలకు సాగునీరందించే పంట కాల్వల్లో తూడు, గుర్రపుడెక్క, చెత్తా చెదారంతో పూర్తిగా పూడుకుపోయింది. నీరు లేకుండా నారుమళ్లు పోసెదేలా?. నారుమడి దశ పూర్తి చేసుకుంటే నాట్లు వేసుకోవచ్చు. పంటకు బోదెలు ఈ రకంగా ఉండడంతో నీరు ముందుకు సాగే ప్రక్రియ ప్రశ్నార్థకంగా ఉంది. ఇరి గేషన్‌ అధికారులు దృష్టి సారించి పేరుకు పోయిన చెత్తను తొలగించాలి. 


పంటకాల్వల ఆక్రమణలు తొలగించాలి

పి.శ్రీనివాస్‌, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి 

పంట కాల్వలపై ఇటీవల ఆక్రమణలు విపరీతంగా పెరి గిపోయాయి. నిర్మాణాలు సాగిస్తున్నారు. సాగునీరు అం దించే పంట కాల్వల్లో కొంత కాలంగా ఇరిగేషన్‌ అధికారుల నిర్లక్ష్యం కారణంగా పూడికల తీతకు నోచుకోలేదు. ఫలితంగా శివా రు పొలాలకు సాగునీరు అందడం లేదు. కాల్వల ద్వారా నీరు పారే మార్గం లేక సాగు నీరందక పొలాలు బీడువారే ప్రమాదం ఉంది. 

Updated Date - 2021-06-22T05:12:00+05:30 IST