కరోనా దూకుడు

ABN , First Publish Date - 2021-07-30T04:53:41+05:30 IST

పెదవేగి మండలంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.

కరోనా దూకుడు
చాటపర్రులో ప్రత్యేక పారిశుధ్య పనులు

 పెదవేగి మండలంలో పెరుగుతున్న కేసుల సంఖ్య

గురువారం 17 కేసులు నమోదు.. ఒకరి మృతి

పెదవేగి, జూలై 29 : పెదవేగి మండలంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. మండలంలో బుధవారం 15 కరోనా పాజిటివ్‌ కేసు లు నమోదు కాగా గురువారం ఆ సంఖ్య 17కు పెరిగింది. ఒకరు మృతి చెందారు. ఇప్పటివరకు మండలంలో 1575 పాజిటివ్‌ కేసులు నమోదవ్వగా వారిలో హోమ్‌ ఐసొలేషన్‌లో 1354 మంది ఉండి చికిత్స పూర్తి చేసుకున్నారని తెలిపారు. ప్రస్తుతం 81 మంది హోం ఐసొలేషన్‌లో ఉన్నారని, 104 మంది ఆస్పత్రి లో చికిత్స పొందుతున్నారని వివరించారు. ఇప్పటి వరకు మండలంలో కరోనా పాజిటివ్‌ మరణాలు 36 కాగా అందులో ఏడుగురు ఇంటిదగ్గర మృతి చెందగా, 29 మంది ఆస్పత్రిలో మృతి చెందారని డాక్టర్‌ ప్రసన్నకుమార్‌ చెప్పారు.

 పెదపాడు : పెదపాడు మండలం వట్లూరు పీహెచ్‌సీ పరిధిలో, పెదపాడు పీహెచ్‌సీ పరిధిలో ఎటువంటి కొవిడ్‌ కేసులు నమోదు కాలేదు. వట్లూరు పీహెచ్‌సీలో కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ను 220 మంది పంపిణీ చేశారు. 

 ఏలూరు రూరల్‌ : కొవిడ్‌ తగ్గుముఖం పట్టినా నిబంధనలు మాత్రం పాటించాలని విస్మరిస్తే ముప్పు తప్పదని మండల వైద్యాధికారి డాక్టర్‌ దేవ్‌ మనోహర్‌ కిరణ్‌ హెచ్చరించారు. మండలంలో తాజాగా గురువారం ఒక్క కేసు కూడా నమోదు కాలేదని తెలిపారు. కాగా వానాకాలంలో సీజనల్‌ వ్యాధులు విస్తరించకుండా ప్రతి పంచాయతీ పరిధిలో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టారు.  

Updated Date - 2021-07-30T04:53:41+05:30 IST