1,576 పాజిటివ్‌ కేసులు

ABN , First Publish Date - 2021-05-14T05:39:14+05:30 IST

కొవిడ్‌ పాజిటివ్‌ బాధితుల సంఖ్య మళ్ళీ పెరుగుతోంది.

1,576 పాజిటివ్‌ కేసులు

ఏలూరుఎడ్యుకేషన్‌, మే 13 : కొవిడ్‌ పాజిటివ్‌ బాధితుల సంఖ్య మళ్ళీ పెరుగుతోంది.గురువారం జిల్లాలో కొత్తగా 1576 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి మొత్తం ఆసుపత్రులు, హోం ఐసోలేషన్లలో చికిత్స పొందుతున్న బాధితుల సంఖ్య 11,951కి పెరిగింది. కరోనా కాటుకు నలుగురు బలయ్యారు. జిల్లా వ్యాప్తంగా మరో 36 చోట్ల కంటైన్మెంట్‌ జోన్లు ఏర్పాటుకానున్నాయి.  

వ్యాక్సిన్‌ నిల్వలు ఖాళీ 

రెండో డోసు వ్యాక్సిన్‌ సరఫరా కోసం ఏర్పాటు చేసిన 128 వ్యాక్సినేషన్‌ సెంటర్‌ (సివిసి)లలో గురు వారం 2 వేల 500 డోసుల కోవిషీల్డ్‌ నిల్వలతో టీకా పంపిణీ చేపట్టారు. కొన్నిచోట్ల వ్యాక్సిన్‌ నిల్వలకు సర ఫరా సంఖ్య లో రెండో డోసు లబ్ధిదారులు లేకపోవ డంతో మిగి లిన నిల్వలను సమీప సీవీసీలకు తర లించి టీకా వేశారు. ఇలా మిగిలిపోయిన నిల్వలతో శుక్రవారం వ్యాక్సినేషన్‌ చేపడతామని ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. కొత్తగా వ్యాక్సిన్‌ దిగుమతిపై జిల్లాకు సమాచారం అందలేదు. కాగా గన్నవరంలోని స్టేట్‌ వ్యాక్సిన్‌ సెంటర్‌లో కొవిషీల్డ్‌, కోవాగ్జిన్‌ నిల్వలు గురువారం అందుబాటులో ఉన్నప్పటికీ కేవలం రెండో డోసు లబ్దిదారులకే ప్రత్యేకించినందున ప్రణాళికా బద్దంగా వ్యవహరించాలని ఆరోగ్యశాఖ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. 

Updated Date - 2021-05-14T05:39:14+05:30 IST