పల్లెలపై కరోనా పడగ

ABN , First Publish Date - 2021-05-18T05:53:56+05:30 IST

పట్టణ ప్రాంతాల్లో అత్యధి కంగా నమోదైన కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు కొద్ది రోజులుగా పల్లెల్లోనూ దూసుకుపోతున్నాయి.

పల్లెలపై కరోనా పడగ


పట్టణాలతోపాటు దూసుకుపోతున్న వైరస్‌ 

ఒక్కరోజే 16 మంది మృత్యువాత

 కొత్తగా 1185 మందికి పాజిటివ్‌ 

ఏలూరు ఎడ్యుకేషన్‌, మే 17 : పట్టణ ప్రాంతాల్లో అత్యధి కంగా నమోదైన కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు కొద్ది రోజులుగా పల్లెల్లోనూ దూసుకుపోతున్నాయి. దాదాపు అన్ని మండలా ల్లోనూ రెండంకెల్లో నిత్యం పాజిటివ్‌ కేసులు నమోదవుతూ ఉండటం ఆందోళన కలిగిస్తోంది. కంటైన్మెంట్‌ జోన్లలో పాజి టివ్‌లు పెరుగుతుండడం, ఇతర ప్రాంతాలకు రాకపోకలు సాగించే సాధారణ ప్రజలు పాజిటివ్‌ బాధితుల్లో ఉంటు న్నారు. సోమవారం నమోదైన పాజిటివ్‌ కేసుల్లో ఏలూరు, తాడేపల్లిగూడెం, భీమవరం తొలి స్థానాన్ని ఆక్రమించగా పల్లె ప్రాంత మండలాలైన భీమడోలు, చాగల్లు, దెందులూరు, దేవరపల్లి, ద్వారకా తిరుమల, గణపవరం, గోపాలపురం, ఇరగవరం, కొయ్యలగూడెం, కుక్కునూరు, లింగపాలెం, మొగల్తూరు, పాలకోడేరు, పెదపాడు, పెదవేగి, పెంటపాడు, పెనుగొండ, పెనుమంట్ర, పోడూరు, పోలవరం, ఉండ్రా జవరం, వీరవాసరం, ఉంగుటూరు, యలమంచిలి మండ లాల్లో 30 నుంచి గరిష్టంగా 40 వరకు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

ఏలూరు రూరల్‌ : మండలంలోని ఏడు గ్రామాల్లో సెకండ్‌ వేవ్‌లో మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకూ 700 మందికిపైగా వైరస్‌ బారిన పడ్డారు.  

పెంటపాడు : మండలంలో కొవిడ్‌ మహమ్మారి విరుచుకుపడుతోంది. ఒక్క మండల కేంద్రంలోనే ఇప్పటి వరకు అధికారికంగా 126 కేసులు నమోదయ్యాయి. మరణాలు పెరుగుతున్నప్పటికీ అధికారిక గణాంకాల్లో మాత్రం వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి.

నల్లజర్ల : మండలంలో ఇప్పటి వరకు అధికారిక లెక్కల ప్రకారం.. 320 మందికి పాజిటివ్‌ వచ్చింది. వీరిలో ఒక్క మండల కేంద్రంలోనే 100కి పైగా కేసులు నమోదయ్యాయి. పాజిటివ్‌ రిపోర్టులు ఆలస్యంగా రావడంతో అప్పటికే బాధితులు కొంత మందితో కలిసి ఉండడం ద్వారా మరింత కేసులు పెరుగుతున్నాయి. 


కరోనా వేటుకు 16 మంది మృతి

జిల్లాలో సోమవారం కరోనా మరణ మృదంగం పెను విధ్వంసాన్ని సృష్టించింది. ఒక్క రోజే 16 మంది కొవిడ్‌కు బలయ్యారు. సెకండ్‌ వేవ్‌లో ఒక్క రోజులో ఇంత పెద్ద సం ఖ్యలో మృత్యుబారిన పడడం ఇదే ప్రథమం. తాజాగా 1,185 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ కాగా, యాక్టివ్‌ కేసుల సంఖ్య 13 వేల 849కి పెరిగింది. కొత్తగా 52 చోట్ల కంటైన్మెంట్లు ఏర్పాటు కానున్నాయి. 

Updated Date - 2021-05-18T05:53:56+05:30 IST