చాటపర్రులో బ్లీచింగ్‌ చల్లుతున్న పారిశుధ్య కార్మికులు

ABN , First Publish Date - 2022-01-21T05:20:24+05:30 IST

చాపకింద నీరులా కరోనా వ్యాప్తి చెందుతు న్నా జనం నిర్లక్ష్యం వీడడం లేదు.

చాటపర్రులో బ్లీచింగ్‌ చల్లుతున్న పారిశుధ్య కార్మికులు

చాపకింద నీరులా..
పెరుగుతున్న కరోనా పాజిటివ్‌
ఏలూరు రూరల్‌ మండలంలో 39 కేసులు


ఏలూరు రూరల్‌, జనవరి 20 : చాపకింద నీరులా కరోనా వ్యాప్తి చెందుతు న్నా జనం నిర్లక్ష్యం వీడడం లేదు. మాస్క్‌లు ధరించకుండా, భౌతిక దూరం పాటించకుండా తిరుగుతున్నారు. దీంతో కొద్ది రోజులుగా ఏలూరు రూరల్‌ మండలంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. తాజాగా గురువారం 39 కేసులు నమోదయ్యాయి. క్రమంగా బాధితుల సంఖ్య పెరుగు తూ రావడంపై అధికార యంత్రాంగం దృష్టి సారించింది. రోజురోజుకు కేసులు పెరగడం, రెండంకెల వరకు నమోదు కావడం ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటివరకు గత వారం రోజుల్లో కేసుల సంఖ్య 80 దాటింది. మండలంలోని మారుమూల గ్రామాల్లోనూ కొవిడ్‌ బాధితుల సంఖ్య పెరుగుతోంది. పాజిటివ్‌ వచ్చిన ప్రాంతాల్లో వైద్య సిబ్బంది కొవిడ్‌ టెస్టుల నిర్వహణ విస్తృతంగా నిర్వహిస్తున్నారు. మరోపక్క ఫీవర్‌ సర్వే వేగం పుంజుకుంది. కొవిడ్‌ కేసుల సంఖ్య పెరుగుతున్నా జనంలో మార్పు రావడం లేదు. అధిక శాతం మాస్కులు ధరించకుండానే రోడ్లపైకి వస్తున్నారు. దుకాణాల వద్ద భౌతిక దూరం పాటించ డం లేదు. అధికారులు హెచ్చరిస్తున్నా చాలా వరకు వ్యాపారులు మాస్క్‌లు ధరించకుండా లావాదేవీలు సాగిస్తున్నారు.  


పెదపాడు మండలంలో–12
పెదపాడు, జనవరి 20: మండలంలో గురువారం 12 కరోనా పాజిటివ్‌ కేసు లు నమోదయ్యాయి. వట్లూరు పీహెచ్‌సీ పరిధిలో వట్లూరులో మూడు, ఏపూ రులో ఒక పాజిటివ్‌ కేసు నమోదు కాగా, పెదపాడు పీహెచ్‌సీ పరిధిలో కొత్త ముప్పర్రు, పాతముప్పర్రు గ్రామాల్లో ఒక్కొక్కటి, తోటగూడెం, వసంతవాడ గ్రామాల్లో మూడేసి చొప్పున కేసులు నమోదైనట్టు వైద్యసిబ్బంది తెలిపారు.


కొవిడ్‌ నిబంధనలు పాటించాలి
పెదపాడు, జనవరి 20 : ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కొవిడ్‌ నిబంధనలు పాటించాలని పెదపాడు ఎస్‌ఐ జ్యోతిబస్‌ తెలిపారు. పెదపాడు బస్టాండ్‌ సెంట ర్‌లో వాహనాల తనిఖీలు నిర్వహించి నిబంధనలు పాటించని పలు వాహన దారులకు ఈ–చలానాలు విధించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లా డుతూ కొవిడ్‌ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో వాహనదారులు తప్పనిసరిగా మాస్క్‌ లు ధరించాలన్నారు. దుకాణాల వద్ద భౌతిక దూరాలు, శానిటైజర్లు వినియోగిం చడం తప్పనిసరన్నారు. కొవిడ్‌ నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసు కుంటామన్నారు.

Updated Date - 2022-01-21T05:20:24+05:30 IST