మళ్లీ కలవరం

ABN , First Publish Date - 2022-01-20T06:05:39+05:30 IST

ఏలూరు రూరల్‌ మండలంలో మళ్లీ కరోనా వ్యాప్తి మొదలైందన్న భయం ప్రజల్లో నెలకొంది.

మళ్లీ కలవరం
శనివారపుపేటలో ప్రత్యేక శానిటేషన్‌

ఏలూరు రూరల్‌ మండలంలో 28 కరోనా కేసులు 

భయాందోళనలో ప్రజలు

ఇంటింటా ముమ్మరంగా ఫీవర్‌ సర్వే

అప్రమత్తంగా ఉండాలంటూ వైద్యాధికారుల హెచ్చరిక


ఏలూరు రూరల్‌, జనవరి 19 : ఏలూరు రూరల్‌ మండలంలో మళ్లీ కరోనా వ్యాప్తి మొదలైందన్న భయం ప్రజల్లో నెలకొంది. మండలంలో ఒకేసారి బుధ వారం 28 కేసులు బయటపడడం ఆందోళన కలిగిస్తోంది. కొవిడ్‌ కేసులు మం డలంలో రోజురోజుకు పెరుగుతుండడం పట్ల అధికారులు ఉలిక్కిపడ్డారు. మం గళవారం 17 కేసులు, బుధవారం 28 కేసులు నమోదయ్యాయి. దీంతో టెస్టింగ్‌, ట్రేసింగ్‌, కొవిడ్‌ టెస్ట్‌లు నిర్వహిస్తున్నారు. ఇంటింటా ముమ్మరంగా ఫీవర్‌ సర్వే నిర్వహిస్తున్నారు. ముందస్తు జాగ్రత్తలపై పటిష్ట చర్యలు చేపట్టాలని అధికారు లు ఆదేశించారు. కొవిడ్‌ వచ్చిన ప్రాంతాల్లో అధికారులు ప్రత్యేక శానిటేషన్‌ చర్యలు చేపట్టారు.మాస్క్‌లు ధరించడం, చేతులు ఎప్పటికప్పుడు శుభ్రం చేసు కోవడం, భౌతిక దూరం పాటిం చడం వంటి ముందు జాగ్రత్తలు ఇప్పటి నుంచే పాటిస్తే మేలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. అయితే మండలంలో ఆ పరిస్థితులు ఎక్కడా కానరావడం లేదు. కొవిడ్‌ నిబంధనలు మరిచిపోయారు. భౌతిక దూరం కనీసం పాటించడం లేదు. మాస్క్‌లు  కొందరే ధరిస్తున్నారు. ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాల్లో కిక్కిరిసి ప్రయాణిస్తున్నారు. 


పెదపాడు మండలంలో నాలుగు కేసులు

పెదపాడు, జనవరి 19 : వట్లూరు పీహెచ్‌సీ పరిధిలో వట్లూరు, అప్పనవీడు గ్రామాల్లో ఒక్కొక్కటి చొప్పున పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, పెదపాడు పీహెచ్‌సీ పరిధిలో తోటగూడెం, వసంతవాడ గ్రామాల్లో ఒక్కొక్కటి చొప్పున పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని వైద్యసిబ్బంది తెలిపారు. 


నగరంలో రాత్రి కర్ఫ్యూ అమలు

ఏలూరుక్రైం, జనవరి 19 : కరోనా వైరస్‌ సోకకుండా ప్రతీ ఒక్కరూ ముందస్తు చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వం విధించిన కర్ఫ్యూ అమలుకు సహకరించా లని వన్‌టౌన్‌ సీఐ బోణం ఆదిప్రసాద్‌ ప్రజలకు సూచించారు. జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ ఆదేశాల మేరకు నగరంలో కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. బుధవారం రాత్రి  పదకొండు గంటల తర్వాత రోడ్లపై మాస్క్‌లు లేకుండా తిరుగుతున్న వారిని ఆపి అంబులెన్స్‌ ఎక్కించారు. మాస్క్‌ ధరించకుంటే కరోనా బారిన పడి అంబులెన్స్‌లో ఆస్పత్రికి చేరాల్సి ఉంటుందని హెచ్చరిస్తూ కరోనాపై సీఐ వారికి అవగాహన కల్పించారు. సీఐ స్వయంగా అంబులెన్స్‌ నడుపుతూ గస్తీ నిర్వహించడం విశేషం.

 

పాఠశాలలకు సెలవులు ప్రకటించాలి

ఏలూరు ఎడ్యుకేషన్‌, జనవరి 19 : కొవిడ్‌ వ్యాప్తి తీవ్రంగా ఉన్న నేప థ్యంలో పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ బుధవారం డీఈవో సి.వి.రేణు కకు తెలుగునాడు స్టూడెంట్స్‌ ఫెడరేషన్‌ (టీఎన్‌ఎస్‌ఎఫ్‌) ఏలూరు పార్ల మెం టు జిల్లా అధ్యక్షుడు పెనుబోయిన మహేష్‌ యాదవ్‌ వినతిపత్రాన్ని అంద జేశారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థుల భవి ష్యత్తును దృష్టిలో ఉంచుకుని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించాలని కోరారు. కరోనా థర్డ్‌వేవ్‌ పట్ల విద్యా ర్థులతో పాటు తల్లిదండ్రులూ తీవ్ర ఆందోళనలో ఉన్నారన్నారు. గడచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా పది వేలకు పైగా కేసులు నమోదయ్యాయని, ఆ మేరకు కొవిడ్‌ తీవ్రత అర్థమవుతోందన్నారు.  తెలంగాణతో పాటు, పది రాష్ట్రా ల్లో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారన్నారు. రాష్ట్రంలోని అన్ని పాఠశా లల విద్యార్థులకు వ్యాక్సినేషన్‌ పూర్తయ్యిం దని విద్యాశాఖ మంత్రి చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కేవలం పదో తరగతి విద్యార్థులకు మాత్రమే వ్యాక్సిన్‌ వేశారని, ఇంకా ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు బాలబాలికలకు వ్యాక్సినేషన్‌ ప్రారంభం కాలేదన్నారు. విద్యా సంస్థల్లో ఇప్పటికీ కొవిడ్‌ నిబంధ నలు అమలు చేయడం లేదన్నారు. విద్యార్థులకు ఏమైనా జరిగితే ముఖ్య మంత్రి బాధ్యత వహిస్తారా.. అని ప్రశ్నించారు. పాఠశాలలకు సెలవులు ప్రక టించి గతంలో నిర్వహించిన విధం గానే ఆన్‌లైన్‌ తరగతులు చేపట్టాలన్నారు. డీఈవోను కలిసిన వారిలో టీఎన్‌ ఎస్‌ఎఫ్‌ నాయకులు వి.వినయ్‌కుమార్‌, ఎం.సూర్య, ఎస్‌.సతీష్‌, డి.మహేష్‌, చందు తదితరులు ఉన్నారు.  

Updated Date - 2022-01-20T06:05:39+05:30 IST